హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు పేలిన క్షణాలు...

హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు పేలిన క్షణాలు...

జపాన్‌లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు దాడి జరిగి 75 ఏళ్లు గడిచాయి.

ముప్పావు శతాబ్దం గడిచినా నాటి మహావిషాదపు గాయాలు మానలేదు. రేడియేషన్ ప్రభావమూ తొలగిపోలేదు.

అసలు, నాడు అణు బాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది? అణు విస్ఫోటం చూసినవాళ్లకు ఎలా అనిపించింది? అణు బాంబులు వేసిన విమాన పైలట్లు ఆ దృశ్యాలను చూసి ఏమనుకున్నారు?

రాడార్లు పసిగట్టినా....

అది 1945 ఆగస్ట్ 6, సమయం ఉదయం 7 గంటలు. హిరోషిమాలో భారీ శబ్దంతో హెచ్చరిక సైరన్ మోగింది. దూసుకొస్తున్న అమెరికా యుద్ధ విమానాలను, జపాన్ రాడార్లు పసిగట్టాయి.

అప్పటికే, ఇంధన నిల్వలు అయిపోవడంతో, అమెరికా విమానాలను అడ్డుకోవడానికి, జపాన్ తన యుద్ధవిమానాలను పంపించలేకపోయింది. ఏడు గంటలకు మొదలైన సైరన్, ఎనిమిది గంటలకు ఆగింది.

ఎనిమిది గంటలా తొమ్మిది నిమిషాలకు, అమెరికా వైమానిక దళానికి చెందిన, కల్నల్ పాల్ టిబెట్స్, తన బీ29 యుద్ధవిమానం 'ఎనోలా గే' ఇంటర్‌ కామ్‌లో, ఓ ప్రకటన చేశారు. తమ సహచరులను సమాయత్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)