అమిత్ షా: ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కోవిడ్ అనంతర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
అమిత్ షా గత నాలుగైదు రోజులుగా నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు ఉన్నట్లు చెప్తున్నారని ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఎయిమ్స్) పేర్కొంది.
అయితే.. కోవిడ్-19 పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని వెల్లడించింది.
ప్రస్తుతం ఆయన సౌకర్యవంతంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచే తన విధులు కొనసాగిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ ఒక ప్రకటనలో వివరించారు.
అమిత్ షా వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. ఆయనకు ఆగస్టు 2వ తేదీన కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలటంతో ఆస్పత్రిలో చేరారు.
గురుగ్రామ్‌లో మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆయన ఆగస్టు 14న కరోనా పరీక్ష నెగెటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు.
వైద్యుల సలహా మేరకు ఒక వారం పాటు ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటానని అమిత్ షా ట్వీట్ చేశారు.
ఆ మరుసటి రోజు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేశారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

మరో 55,000 కొత్త కేసులు నమోదు...
ఇదిలావుంటే.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ దేశంలో కొత్తగా 55,079 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,02,743కు పెరిగింది. ప్రస్తుతం 6,73,166 కేసులు కొనసాగుతుండగా.. 19,77,780 కేసులను డిశ్చార్జ్ చేశారు.
ఇప్పటి వరకూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 51,797 మందికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)