రాజాసింగ్‌ను బ్యాన్ చేసిన ఫేస్బుక్.. ‘ధన్యవాదాలు, నాకో పేజీ క్రియేట్ చేసి ఇవ్వండి’ అన్న బీజేపీ ఎమ్మెల్యే
- దీప్తి బత్తిని
- బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫేస్బుక్ నుంచి బహిష్కరించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ఈమెయిల్ ద్వారా తెలిపారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
"బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలతో రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఫేస్బుక్ విధానాన్ని ఉల్లంఘించారు. అందుకే ఆయన్ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం" అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు.
ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రాజా సింగ్ పేరుతో ఉన్న అకౌంట్లను బ్యాన్ చేశారు.
భారత్‌లో అధికారిక బీజేపీ నేతలు ఫేస్బుక్లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఫేస్బుక్ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని.. చర్యలు తీసుకోవడం లేదని 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' ఇటీవల ఓ కథనం రాసింది.
ఫొటో సోర్స్, facebook/Rajasingh
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు.
దీనికి ప్రతిస్పందనగా ఫేస్బుక్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై గతంలో బీబీసీ తెలుగుతో రాజాసింగ్ మాట్లాడారు. తనకు అధికారికంగా ఫేస్బుక్లో ఎలాంటి పేజీ లేదని వివరించారు.
"2018 లో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆ తరువాత నేను ఫేస్బుక్లో పోస్టులు చేయలేదు. ప్రస్తుతం ఉన్నవన్నీ నా అభిమానులు నా పేరు మీద నడుపుతున్న పేజీలే. వాటితో నాకు సంబంధం లేదు" అని ఆయన తెలిపారు. అయితే ఈ పేజీలలో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తాను అన్నారు.
ఫేస్బుక్ కామెంట్స్‌పై రాజాసింగ్: 'నేను అన్నదేదీ తప్పు కాదు... కరెక్టే'
ఫేస్బుక్ తాజాగా తీసుకున్న చర్యలపై స్పందిస్తూ, రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. తన పేరు మీదున్న అకౌంట్లను డిలీట్ చేయటం హర్షనీయమేననీ, కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్ నేతల అకౌంట్లను కూడా పరిశీలించాలని అన్నారు.
"నా పేరు మీద ప్రస్తుతమున్న పేజీలు నా అధికారిక పేజీలు కాదు. అవన్నీ బంద్ చేసినందుకు ధన్యవాదాలు.. నా అధికారిక పేజీ 2018 లో హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత దాన్ని వాడేందుకు అనుమతి ఇవ్వలేదు. నేను సొంతంగా వాడేందుకు నాకు ఫేస్బుక్ పేజీ కావాలి. దాన్ని ఫేస్బుక్ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తాను. నాకు పేజీ ఓపెన్ చేసేందుకు అనుమతించాలని ఫేస్‌బుక్‌కు మెయిల్ చేస్తాను" అని ఆయన అన్నారు.
దేశంలో విద్వేష వ్యాఖ్యల కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై ఫేస్బుక్ ప్రతినిధులు బుధవారం కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎదుట హారయ్యారు. కొన్ని అంశాల్లో పక్షపాతాన్ని అనుసరిస్తున్నారా? అంటూ వీరిని కమిటీ ప్రశ్నించింది.
రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. విద్వేష వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించిన ఘటనల జాబితాను ఇవ్వాలని ఫేస్బుక్ ప్రతినిధులకు కమిటీ సూచించింది. ఆ తర్వాత ఫేస్బుక్ రాజా సింగ్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే, రాజా సింగ్‌ను బ్యాన్ చేశారా లేక ఆయన పేరుపై ఉన్న పేజీలను మాత్రమే బ్యాన్ చేశారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)