రాహుల్ గాంధీ: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు, కింద పడేశారు'

రాహుల్ గాంధీ: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు, కింద పడేశారు'

హాథ్‌రస్‌లో సామూహిక అత్యాచారానికి గురైందని భావిస్తున్న, మరణించిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ గురువారం దిల్లీ నుంచి కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

ఈక్రమంలో పోలీసులు తనపై లాఠీఛార్జి చేశారని, రోడ్డుపైకి నెట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

‘‘పోలీసులు నన్ను లాఠీతో కొట్టి, కింద పడేశారు. అయినా నాకు సమస్యేమీ లేదు. భారతదేశంలో కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాత్రమే నడవగలరా? సామాన్యులు నడవలేరా? ఈ దేశంలో కేవలం మోదీ మాత్రమే కాలినడకన వెళ్లగలరా? సామాన్య ప్రజలు వెళ్లకూడదా? తొలుత మా కారును ఆపేశారు. మేం కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను హాథ్‌రస్‌ వెళ్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)