హైదరాబాద్: రోడ్డుపై పరుగెత్తుతూ అంబులెన్సుకు దారి చూపి.. ఓ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్

హైదరాబాద్: రోడ్డుపై పరుగెత్తుతూ అంబులెన్సుకు దారి చూపి.. ఓ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ముందు పరిగెత్తుతూ... వాహనాలను క్లియర్ చేస్తూ, అంబులెన్స్‌కి దారి చూపించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ బాబ్జీ.

దీంతో అంబులెన్స్ సకాలానికి ఆస్పత్రికి చేరుకోవడంతో అందులో ఉన్నవ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్యూటీలో బాబ్జీ కనబర్చిన నిబద్ధతకు పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)