రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీని స్థానికులు ఎందుకు వద్దంటున్నారు

రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీని స్థానికులు ఎందుకు వద్దంటున్నారు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీ స్థానికుల జీవన ప్రమాణాలను మార్చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు నిలబెట్టుకుందో స్వయంగా చూశామని, ఇక్కడ పరిశ్రమ వద్దేవద్దంటూ స్థానికులు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు.

దీంతో భూసేకరణ నుంచి ప్రభుత్వం నాలుగు గ్రామాలను మినహాయించాల్సి వచ్చింది.

భూసేకరణ వివాదాస్పదం కావడంలో ఈ ఫార్మాసిటీ వ్యవహారంలో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని యాచారం ప్రాంతంతోపాటు రసాయన పరిశ్రమలున్న మరికొన్ని ప్రాంతాలలో పర్యటించారు.

స్థానికులు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)