రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తం... పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు

రైతుల నిరసనలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

ఉద్రిక్తతల్లో గాయపడిన రైతులు

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవంనాడు మంగళవారం దేశ రాజధాని దిల్లీలో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారుతోంది.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

ఉద్రిక్తతల్లో గాయపడిన పోలీసు అధికారి

దిల్లీ శివార్లలోని సింఘూ సరిహద్దుల్లో ప్రశాంతంగా ఈ ర్యాలీ మొదలైంది. పశ్చిమ దిల్లీలోని నాంగ్‌లోయికి వెళ్లేవరకు అంతా ప్రశాంతంగా సాగింది.

ఫొటో సోర్స్, MONEY SHARMA/gettyimages

ఫొటో క్యాప్షన్,

పోలీసులపైకి ఎక్కిన నిరసనకారుడు

ఫొటో క్యాప్షన్,

ర్యాలీగా వస్తున్న నిరసనకారులు

అయితే, దిల్లీ-నోయిడా, దిల్లీ-ఘాజియాబాద్ కూడలి వద్ద అక్షర్‌ధామ్ సమీపంలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

బస్సును ధ్వంసం చేసిన నిరసనకారులు

ఐవోటీ పరిసరాల్లో దిల్లీ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సును రైతులు ధ్వంసం చేశారు.

ఫొటో క్యాప్షన్,

పోలీసు వాహనంపై నిరసనకారులు

ఐవోటీ పరిసరాల్లోనే కొందరు పోలీసులపై నిరసనకారులు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు ఏఎన్‌ఐలో ప్రసారం అయ్యాయి. దీంతో మరోసారి నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

పోలీసులపై నిరసనకారుల దాడి

పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో దిల్లీ మెట్రో గ్రీన్ లైన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

బైఠాయించిన పోలీసులు

నాంగ్లోయిలో రైతులు ప్రదర్శనగా వస్తున్న మార్గంలో వారిని ముందుకు వెళ్లనివ్వకుండా దిల్లీ పోలీసులు రోడ్డుపై బైఠాయించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)