పీయూష్ గోయల్: ‘ఏపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదు కాబట్టే రైల్వే పనులు ఆగిపోయాయి’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, @PIYUSHGOYAL
రాష్ట్రంలో వ్యయ పంపిణీ ఒప్పందం కింద చేపట్టిన రైల్వే పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం, తన వాటా కింద రూ.1,636.34 కోట్లు ఇవ్వకపోవడం వల్ల రూ.10,200 కోట్ల విలువైన 841 కిలోమీటర్ల నాలుగు లైన్ల పనులు ఆగిపోయాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
‘కడప-మడగట్ట మధ్య రైల్వేలైన్ గురించి శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానమిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చక పోవడం వల్ల కడప-బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయని వెల్లడించారు.
దీని పరిధిలోకే కడప-మడగట్ట లైన్ వస్తుందని, రూ.3,038 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 2020 మార్చి వరకు రైల్వేశాఖ రూ.351 కోట్లు ఖర్చుపెట్టిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 50% ఖర్చును భరిస్తామని 2006లో ఏపీ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటివరకు రూ.132.39 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని తెలిపారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సమకూర్చలేదని, దానివల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు స్తంభించి పోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా సమకూర్చిన తర్వాతే తదుపరి పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏప్రిల్ 1 నాటికి రూ.64,429 కోట్ల విలువైన 32 ప్రాజెక్టుల పనులు ప్లానింగ్, అప్రూవల్, ఎగ్జిక్యూషన్ దశలో ఉన్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వీటి మొత్తం పొడవు 5,704 కిలోమీటర్లు అని చెప్పారు.
రాజ్యసభలో వైకాపా సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత మూడేళ్ల బడ్జెట్లో ఏపీ నుంచి వెళ్లే 4 డబ్లింగ్, 5 విద్యుదీకరణ ప్రాజెక్టులను చేర్చామని, అనుమతులకు లోబడి వీటి పనులు మొదలవుతాయని చెప్పార’’ని ఈ కథనంలో తెలిపారు.
హక్కుల నోటీస్ నాకు వర్తించదు: నిమ్మగడ్డ
సభా హక్కుల నోటీసు తనకు వర్తించదని.. తన పరిధిలోకి రాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చెప్పారంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాసింది.
‘‘శాసనసభ అంటే తనకు అత్యంత గౌరవం ఉం దని.. సభా హక్కులను తాను కించపరచలేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన హ క్కుల నోటీసుకు వివరణ ఇవ్వాలంటూ గురువారం అ సెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కమిషనర్‌కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి నిమ్మగడ్డ శుక్రవారం ఈ-మెయిల్లో సమాధానం పంపారు. తా ను శాసనసభ హక్కులకు భంగం కలిగించానన్న అభియోగాన్ని ఖండించారు.
అయినా సభాహక్కుల నోటీసుపై ముందుకే వెళ్లాలని.. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని వాంఛిస్తే.. తగు సమయంలో సమాధానమిస్తానని తెలిపారు.
తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచించారని వెల్లడించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ దెబ్బకు ఇండియాలో 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచీ పేదరికంలోకి వెళిపోయారు
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశంలో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవితాలపై ప్రభావం పడిందని, వీరిలో కోట్లాది మంది పేదరికంలోకి వెళ్లిపోయారని, యూఎస్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు నవతెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దాదాపు 3.2 కోట్ల మంది మధ్యతరగతి భారతీయులు పేదరికంలోకి వెళ్లిపోయారు. కరోనా కాలంలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య 6.6 కోట్లకు తగ్గి పేదరికంలోకి వెళ్లినవారి సంఖ్య పెరిగిపోయింది.
ప్రమాదకర కరోనాకు ముందున్న అంచనా ప్రకారం దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య 9.9 కోట్లు. భారతదేశ మధ్యతరగతిలో గణనీయమైన తగ్గుదలను, పేదరికంలో చాలా పెరుగుదలను అంచనా వేసిందని ప్రపంచబ్యాంకు ఆర్థిక వృద్ధి అంచనా నివేదికను ఉటంకిస్తూ యూఎస్ పరిశోధనా సంస్థ వెల్లడించింది.
2011-2019 మధ్య దాదాపు 5.7 కోట్ల మంది ప్రజలు మధ్యతరగతి ఆదాయ గ్రూపులోకి వెళ్లిపోయారని పేర్కొన్నది.
ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు తగ్గాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. యూఎస్, బ్రెజిల్ దేశాల తర్వాత అత్యధిక కరోనా కేసులతో భారత్ మూడో స్థానంలో ఉన్నది.
కరోనా మహమ్మారి ప్రవేశానికి ముందే భారత్ ఆర్థికంగా తీవ్ర కుంగుబాటులో ఉన్నది. అయితే, మహమ్మారి ప్రవేశంతో ఆర్థిక మాంద్యం మరింతగా ఎక్కువైంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికి దూరమయ్యారు. దీంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కనీసం తిండికి కూడా నోచుకోని పరిస్థితులు ఎదురయ్యాయి.
కాగా, మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా రోజుకు రూ. 150 లేదా అంతకంటే తక్కువగా సంపాదించే పేద ప్రజల సంఖ్య 7.5 కోట్లకు పెరిగిందని యూఎస్ సంస్థ అంచనా వేసింది.
దేశంలో కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలకు తోడు ఈ ఏడాది ఇంధన ధరలను కేంద్రం తీవ్రంగా పెంచింది. దాదాపు 10శాతం వరకు ధరలు పెరిగాయి.
అంతేకాదు, నిరుద్యోగం, జీతాలలో కోతలు వంటి అంశాలు దేశంలోని ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయనీ, ఇలాంటి కారణాలతో ఉద్యోగాల కోసం దేశ ప్రజలు విదేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అన్నారని ఈ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- సారంగ దరియా: జానపదులు పాడుకునే ఈ పొలం పాట యూట్యూబ్ సెన్సేషన్ ఎలా అయింది?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)