పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణిదేవి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు

వాణిదేవి, రాజేశ్వర రెడ్డి

ఫొటో సోర్స్, facebook/trsparty

నాలుగు రోజుల సుదీర్ఘ లెక్కింపు ప్రక్రియకు తెరపడింది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

'మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌' స్థానం నుంచి సురభి వాణిదేవి విజయం సాధించగా 'నల్లగొండ-వరంగల్-ఖమ్మం' స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు.

ఫొటో సోర్స్, facebook/trsparty

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం సాధించారు.

వాణీ దేవి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 189339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్‌రావుపై ఆమె గెలుపొందారు.

ఫొటో సోర్స్, facebook/palla rajeswarrerddy

ఫొటో క్యాప్షన్,

వరంగల్- ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అందించారు

నల్లగొండ-వరంగల్-ఖమ్మం

నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు.

రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించారు.

ఆధిక్యాని సంబంధించి తుది లెక్కలు ఆదివారం వెల్లడించనున్నారు.శనివారం రాత్రి సమయానికి.. 55వ రౌండ్ తర్వాత ప్రధాన అభ్యర్థుల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,11,190, తీన్మార్ మల్లన్నకు- 83,629, ప్రొఫెసర్ కోదండరాంకు -70,472, ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) - 39,268 ఓట్లతో ఉన్నారు.

రాములు నాయక్ (కాంగ్రెస్) - 27,713, జయసారధి (లెఫ్ట్) - 9,657, చెరుకు సుధాకర్ - 8,732, రాణి రుద్రమ - 7,903 ఓట్లు సాధించారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

టీఆర్ఎస్ భవన్ దగ్గర స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.

సంబరాల్లో అపశ్రుతి

టీఆర్ఎస్ భవన్ దగ్గర కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది.

టపాకాయలు భవన్ ముందు ఉన్న ఒక పందిరికి అల్లుకున్న తీగలపై పడ్డాయి. దాంతో కొంత భాగం కాలింది.

అయితే మొక్కలు కావడంతో మంటలు పెద్దగా వ్యాపించలేదు.

కార్యకర్తలు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేయడంతో పైర్ ఇంజన్ పిలిపించాల్సిన అవసరం రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)