ఉత్తరప్రదేశ్: నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించామన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటల్లో నిజమెంత? - బీబీసీ రియాలిటీ చెక్

  • శ్రుతి మేనన్
  • బీబీసీ రియాలిటీ చెక్
యోగి ఆదిత్య నాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యోగి ఆదిత్య నాథ్

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ ఈ నాలుగేళ్లల్లో సాధించిన విజయాలను ప్రస్తావించారు.

అన్ని పెద్ద వార్తా పత్రికల ద్వారా బీజేపీ ఈ విజయాలను ప్రచారం చేసింది.

యూపీ ప్రభుత్వ వాదనలను, వాస్తవాలను బీబీసీ రియాలిటి చెక్ సమీక్షించింది.

అవేమిటో చూద్దాం.

Annual increase in crimes. %.  .

నేరాలు

ప్రభుత్వ వాదన: నేరాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఈ నాలుగేళ్లల్లో నేరాలు తగ్గాయి.

వాస్తవం: ఉత్తరప్రదేశ్‌లో మొత్తంగా నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ, 2017 తరువాత ఈ పెరుగుదల రేటు తగ్గింది.

యూపీలో గత ప్రభుత్వం (సమాజవాద పార్టీ), ప్రస్తుత ప్రభుత్వం (బీజేపీ) పాలనలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డాటాను బీబీసీ పరిశీలించింది.

గత ఎనిమిది ఏళ్లల్లో యూపీలో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, పెరుగుదల రేటు మాత్రం తగ్గుతూ, పెరుగుతూ ఉంది.

2012, 2015 సంవత్సరాలలో నేరాల పెరుగుదల రేటు వరుసగా 1.5 శాతం, 0.6 శాతం ఉంది.

వాటితో పోలిస్తే 2019లో నేరాల పెరుగుదల రేటు తక్కువగా ఉంది.

యోగి ఆదిత్యానాథ్ 2017లో ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారు. ఆ ఏడాది నేరాలు 10 శాతం పెరిగాయి. ఆ తరువాత సంవత్సరం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.

కానీ, 2019లో నేరాల పెరుగుదల రేటు 3 శాతం మాత్రమే నమోదు అయ్యింది.

కాగా, 2019లో దేశం మొత్తం మీద ఉత్తర ప్రదేశ్‌లోనే భారతీయ శిక్షాస్మృతి కింద అత్యధిక నేరాలు నమోదు అయ్యాయి.

Cases of riots in Uttar Pradesh. .  .

అల్లర్లు

ప్రభుత్వ వాదన: నాలుగేళ్లల్లో రాష్ట్రంలో అల్లర్లు ఏమీ జరగలేదు

వాస్తవం: అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి.

2018 నుంచీ ఉత్తర ప్రదేశ్‌లో మతపరమైన ఘర్షణలు, అల్లర్లు తగ్గాయి.

అయితే, అల్లర్ల విషయంలో.. దేశం మొత్తం మీద మహారాష్ట్ర, బిహార్ తరువాత ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక ఘటనలు నమోదు అయ్యాయి.

ఎన్‌సీఆర్‌బీ డాటా ప్రకారం.. 2016లో యూపీలో 8016 అల్లర్ల కేసులు నమోదయ్యాయి.

2017 సంవత్సరంలో ఈ సంఖ్య 8,990 కాగా, 2018లో 8909, 2019లో 5714 అల్లర్ల కేసులు నమోదయ్యాయి.

2017లో ఆదిత్యానాథ్ అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లు తగ్గాయని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాట అవాస్తవం.

ఫొటో సోర్స్, Getty Images

హత్యలు, అత్యాచారాలు

ప్రభుత్వ వాదన: 2016-17లో హత్య కేసులు 19 శాతం, అత్యాచార కేసులు 45 శాతం తగ్గాయి.

వాస్తవం: యూపీలో హత్యలు, అత్యాచారాల కేసులు తగ్గాయన్నది నిజమే. కానీ, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఈ నేరాలలో ఉత్తర ప్రదేశ్ ముందుంటుంది.

గణాంకాల ప్రకారం.. 2016 నుంచీ 2019 మధ్య యూపీలో నమోదైన అత్యాచార కేసుల్లో 36 శాతం తరుగుదల కనిపించగా, 45 శాతం తరుగుదల ఉంది అని ఆదిత్యానాథ్ చెబుతున్నారు.

భారతదేశం మొత్తం మీద అత్యాచారాల కేసుల్లో ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది.

హత్య కేసుల విషయానికి వస్తే 2016 నుంచీ 2019కి 25 శాతం తరుగుదల కనిపిస్తోంది.

అయితే, దేశం మొత్తం మీద అత్యధిక హత్య కేసులు నమోదు అయిన రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి.

Per Capita Income growth . (% increase over previous year).  .

ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వ వాదన: రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.

2015-16 సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 47,116 నుంచి ప్రస్తుతం రూ. 94,495లకు పెరిగింది.

వాస్తవం: ఉత్తరప్రదేశ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్‌లోని ఆర్థిక, గణాంకశాస్త్ర విభాగం ప్రకారం ఇది అవాస్తవం.

ఆదిత్యానాథ్ 2017లో అధికారంలోకి వచ్చిన తరువాత తలసరి ఆదాయంలో 4 శాతం తరుగుదల కనిపించింది.

2018లో ఇది 2 శాతం పెరిగినా తరువాత సంవత్సరాలలో తలసరి ఆదాయం గణనీయంగా క్షీణించింది.

తాజా గణాంకాల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో తలసరి ఆదాయం 0.4 శాతం తగ్గి రూ. 65,431కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)