ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: మావోయిస్టుల చెర నుంచి CRPF జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల

ఫొటో సోర్స్, Ganesh
కిడ్నాప్ చేసిన సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ఏప్రిల్ 3న బీజాపూర్ దాడి సమయంలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మాన్హాస్ను వారు విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రభుత్వం నియమించిన మధ్యవర్తులు పద్మశ్రీ ధర్మపాల్ సైనీ, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెల్లం బోరయ్య సహా వందలాది మంది గ్రామీణుల సమక్షంలో మావోయిస్టులు మన్హాస్‌ను విడుదల చేశారు.
మన్హాస్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య బృందంతో పాటు బస్తర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు విలేఖరుల బృందం కూడా అక్కడికి వెళ్లి ఆయనను వెంట తీసుకొని వచ్చిందని ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన ఒక అధికారి ధృవీకరించారు.
బాసగూడలో రాకేశ్వర్తో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారని కూడా తెలిపారు.
ఫొటో సోర్స్, ANI
బస్తర్‌లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం
ఎవరీ రాకేశ్వర్ సింగ్
రాకేశ్వర్ సింగ్‌ది జమ్మూలోని నేత్రాకోటి గ్రామం.
బస్తర్ ప్రాంతంలో తన సహచరులతో కలిసి మావోయిస్టుల గాలింపు ఆపరేషన్‌లో రాకేశ్వర్ సింగ్ పాల్గొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు.
చనిపోయిన వారి జాబితాలో కూడా రాకేశ్వర్ సింగ్ మన్హాస్ పేరు లేదు.
దాంతో రాకేశ్వర్ సింగ్ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.
రాకేశ్వర్ సింగ్ తమ వద్ద క్షేమంగా ఉన్నారని బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సమయం వచ్చినప్పుడు ఆయనను విడుదల చేస్తామని అన్నారు.
మరుసటి రోజు ఆయన ఫొటో కూడా విడుదల చేశారు.
ఇవాళ ఆయన్ను విడుదల చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్ఐ సంస్థ పేర్కొంది.
ఇవాళ తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజని రాకేశ్వర్ సింగ్ భార్య మీనూ చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.
బీజాపుర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో శనివారం నాటి ఎన్కౌంటర్లో 22మంది జవాన్లు మరణించారు.
రాకేశ్వర్ సింగ్ 2011లో సీఆర్పీఎఫ్లో చేరారు.
గతంలో వాళ్ల నాన్న కూడా సీఆర్పీఎఫ్లో పని చేశారు.
ఇవి కూడా చదవండి:
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)