ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. CRPF జవాన్ చెప్పిన వివరాలు

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. CRPF జవాన్ చెప్పిన వివరాలు

''ఆయన మా ఎస్ఐ. ఆయన దగ్గరే గ్రెనేడ్ వచ్చి పడింది. గ్రెనేడ్‌లోని చర్రాలు ఆయన కాళ్లలోకి దూసుకెళ్లాయి. కాళ్ల నుంచి చాలా రక్తం పోతూ ఉంది. నొప్పితో ఆయన అరుస్తూ ఉన్నారు. రక్తం ఆగడానికి ఏదైనా పట్టీ కట్టమని అడిగారు. ప్రాథమిక చికిత్స చేయమని అడిగారు. కానీ, ప్రాథమిక చికిత్స చేయాల్సిన పోలీసు అప్పటికే గాయపడి ఉన్నారు. నొప్పితో మా ఎస్ఐ బాధపడుతుండటం చూసి, నా తలపాగా విప్పి, ఆయన కాలుకు పట్టీగా కట్టాను'' అంటూ చెమ్మగిళ్లిన కళ్లతో చెప్పారు బలరాజ్ సింగ్.

సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌లో ఆయన పోలీస్.

శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బలరాజ్ సింగ్ గాయపడ్డారు.

ఈ ఘటనలో 22 మంది పోలీసులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. బీజాపుర్, రాయ్‌పుర్ ఆసుపత్రుల్లో వీరు చికిత్స పొందుతున్నారు.

రాయ్‌పుర్‌లోని రామకృష్ణ ఆసుపత్రిలో బలరాజ్ సింగ్ రాయ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు పొట్టలో తూటా తగిలింది. అయితే, ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేదని వైద్యులు చెప్పారు.

ఎదురుకాల్పుల సమయంలో బలరాజ్ సింగ్ చూపించిన తెగువను రాష్ట్ర ప్రత్యేక డీజీపీ ఆర్‌కే విజ్ స్వయంగా కలిసి అభినందించారు.

బలరాజ్ ఇంకా ఏం చెప్పారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)