బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: ‘‘కేసీఆర్ పంచుతున్న ఆ వెయ్యి కోట్లు ఎవరివి?"

ఫొటో సోర్స్, RS Praveen Kumar
తెలంగాణలో బహుజనరాజ్యం తథ్యమని బిఎస్పీలో చేరిక సందర్భంగా ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆధిపత్య కులాల వారి రాజకీయక్రీడకు అంతం పలికే రోజు త్వరలోనే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలోని నల్గొండలో ఎన్జీ కాలేజీ మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో ప్రవీణ్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లో చేరారు.
దేశం సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందని ఆయన అన్నారు. మన డబ్బును మనకే బిచ్చం వేసినట్టుగా పంచుతూ అదేదో మహోపకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారని ఆయన కేసిఆర్ ప్రభుత్వంపై చెణుకులు విసిరారు. నల్లగొండలో జరిగిన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విమర్శల జడివాన కురిపించారు.
‘‘కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఇపుడెందుకు ఖర్చు చేస్తున్నారు? ఆయన పంచుతానన్న వెయ్యి కోట్లు ఎవరివి? కేసీఆర్‌కు దళితులపై అంత ప్రేముంటే.. ఆయన సొంత ఆస్తులను అమ్మి పంచాలి’’అని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రవీణ్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బీఎస్పీ నియమించింది.
రెక్కాడితే గానీ డొక్కాడని వారి కోసమే తన పదవిని సైతం వదులుకున్నానని ప్రవీణ్ చెప్పారు.
''దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే వారికి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. బహుజన సమాజంలో బానిసలు ఎవరూ ఉండరు. అందరూ పాలకులే ఉంటారు.''
''విశ్వవిద్యాలయాల్లో కొన్నేళ్లుగా నియామకాలే చేపట్టట్లేదు. ప్రజలను బాగుచేసే ఉద్దేశం అసలు ఈ ప్రభుత్వానికి ఉందా''అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అపుడెపుడో ఆర్భాటంగా కేసిఆర్ హామీలిచ్చిన ఆస్పత్రుల నిర్మాణం కొంతైనాపూర్తయి ఉంటే మొన్న కోవిడ్ కల్లోలంలో కొన్ని ప్రాణాలు మిగిలి ఉండేవని అన్నారు.
''ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధించాలనుకునే లక్ష్యాలు ఆయన ప్రకటించబోయే రాజకీయ అజెండాపై ఆధారపడి ఉంటాయి. అన్ని వర్గాలను ఆయన దృష్టిలో పెట్టుకుని అజెండాను రూపొందించాల్సి ఉంటుంది''అని అని సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)