సునందా పుష్కర్ మృతి కేసులో శశి థరూర్‌కు విముక్తి.. ఆయనపై కేసు కొట్టివేసిన దిల్లీ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
శశిథరూర్, సునందా పుష్కర్
భార్య సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌పై ఆరోపణలను బుధవారం దిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. థరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
2014 జనవరి 17న దిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సునంద మృతదేహమై కనిపించారు.
మొదట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అంతా భావించారు. అయితే, ఇది హత్య అంటూ దిల్లీ పోలీసులు ప్రకటించడంతో ఈ కేసు వివాదాస్పదమైంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఎవరి పేర్లూ మొదట్లో ప్రకటించలేదు.
2018లో థరూర్ తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని దిల్లీ పోలీసులు ఆరోపించారు.
దీంతో దిల్లీలోని పాటియాలా న్యాయస్థానం థరూర్‌పై అభియోగాలను పరిగణలోకి తీసుకుంది.
అయితే, అభియోగ పత్రంలోని ఆరోపణలు నిరాధారమైనవని థరూర్ ఆనాడు ట్వీట్ చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు.
తాజాగా కేసులో తనకు విముక్తి కల్పిస్తూ జడ్జి గీతాంజలి గోయెల్ నిర్ణయం తీసుకోవడంతో ఆమెకు థరూర్ ధన్యవాదాలు తెలిపారు.
‘‘నా భార్య మృతి అనంతరం నన్ను వెంటాడిన పీడ కలలకు ఈ కోర్టు నిర్ణయం చరమగీతం పాడింది. నాకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు, అసత్య వార్తలను మౌనంగా ఎదుర్కొన్నాను. నాపై నాకు నమ్మకముంది. అదే నేడు గెలిచింది’’అని థరూర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్‌లకు అఫ్గానిస్తాన్ అడ్డాగా మారుతుందా?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)