టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్

ఫొటో సోర్స్, Kiyoshi Ota/Getty Images
బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన కృష్ణ నాగర్
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. మొత్తం 19 పతకాలను సాధించింది.
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలను గెలుపొందారు.
ఆటలకు చివరి రోజు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు కృష్ణ నాగర్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, సుహాస్ యతిరాజ్ రజత పతకాన్ని సాధించారు.
ఫొటో సోర్స్, Reuters
బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించిన కలెక్టర్ సుహాస్ యతిరాజ్
అంతకుముందు రోజు శనివారం, భారత్ తరఫున ప్రమోద్ భగత్ స్వర్ణాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ గేమ్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించారు.
ఆయనతో పాటు బ్యాడ్మింటన్ ఈవెంట్లోనే మనోజ్ సర్కార్ కాంస్య పతకాన్ని గెలిచారు.
ఈ ప్రదర్శనతో పతకాల పట్టికలో భారత్ 26వ స్థానంలో నిలిచింది. మొత్తం 199 పతకాలు సాధించిన చైనా అగ్రస్థానంలో నిలవగా, 122 పతకాలు గెల్చుకున్న బ్రిటన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. చైనా ఖాతాలో 93, బ్రిటన్ ఖాతాలో 41 స్వర్ణాలు చేరాయి.
ఫొటో సోర్స్, Kiyoshi Ota/Getty Images
ప్రమోద్ భగత్
స్వర్ణ కాంతులు
ఈ క్రీడల్లో భారత్ గెలిచిన 5 స్వర్ణాల్లో షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్లలో రెండు చొప్పున రాగా, జావెలిన్ త్రో ఈవెంట్లో ఒక స్వర్ణం లభించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైపిల్ షూటింగ్ ఈవెంట్లో విజేతగా నిలిచిన అవని లేఖరా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది.
ఆ తర్వాత వరుసగా జావెలిన్ త్రో ఈవెంట్లో సుమిత్ అంటిల్, 50 మీటర్ల పిస్టల్ షూటింగ్లో మనీశ్ నర్వాల్, బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్లు బంగారు పతకాలతో మెరిశారు.
ఫొటో సోర్స్, REUTERS/ISSEI KATO
భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన
2016 రియో పారాలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలను గెలుపొందింది. అంతకుముందు భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు ఉన్నాయి.
అంటే 2020 పారాలింపిక్స్ క్రీడలకు ముందు భారత్ ఖాతాలో కేవలం 4 స్వర్ణాలే ఉండగా... తాజా క్రీడల్లోనే 5 స్వర్ణాలు లభించాయి. అందుకే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనను అత్యుత్తమంగా భావిస్తున్నారు.
అవని లేఖరా: ‘హాబీగా మొదలుపెట్టా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టా’
రజత పతక విజేతలు
తాజా క్రీడల్లో భారత్‌కు 8 రజతాలు లభించాయి. అందులో అథ్లెటిక్స్ క్రీడాంశం నుంచే అత్యధికంగా 5 మెడల్స్ వచ్చాయి.
ఈ గేమ్స్ ముందు వరకు భారత్ ఖాతాలో ఉన్న సిల్వర్ మెడల్స్ సంఖ్య 4. ఇందులో 1984 క్రీడల్లో భారత్‌కు రెండు రజతాలు లభించగా... 2012, 2016 పారాలింపిక్స్‌లో ఒక్కో రజతం లభించింది.
ఈసారి టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో భవీనా పటేల్‌కు తొలి రజతం దక్కింది. ఆ తర్వాత వరుసగా హైజంప్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా, జావెలిన్ త్రో ఈవెంట్లో దేవేంద్ర జజరియా, హై జంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు, ప్రవీణ్ కుమార్, 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సింఘరాజ్ అదాన, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్ ఈ పతకాన్ని అందుకున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్
కాంస్య పతకధారులు
భారత్‌కు లభించిన 6 కాంస్యాల్లో షూటింగ్, అథ్లెటిక్స్‌లో 2 చొప్పున... ఆర్చరీ, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో ఒక్కోటి వచ్చాయి.
జావెలిన్ త్రో ఈవెంట్లో సుందర్ సింగ్ గుర్జర్ మొదట కాంస్యాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 10 మీటర్ల పిస్టల్ షూటింగ్లో సింఘరాజ్ అధాన, హైజంప్‌లో శరద్ కుమార్, 50 మీటర్ల రైఫిల్ షూటింగ్లో అవనీ లేఖరా, ఆర్చరీలో హర్వీందర్ సింగ్, బ్యాడ్మింటన్‌లో మనోజ్ సర్కార్ మూడో స్థానంలో నిలిచారు.
పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించారు.
పతక విజేతలందరితో ఫోన్లో మాట్లాడిన ఆయన వ్యక్తిగతంగా కూడా వారికి అభినందనలు తెలిపారు.
బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు
ఇవి కూడా చదవండి:
- షరియా పాటించే ముస్లిం దేశాల్లోని మహిళలు ఆ చట్టం గురించి ఏమంటున్నారు?
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- ఓవల్ టెస్ట్ మ్యాచ్: పిచ్‌పైకి కమెడియన్.. ఉమేశ్ యాదవ్‌లా బౌలింగ్, బెయిర్ స్టోతో గొడవ
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)