బిగ్‌బాస్ సీజన్ 5: హౌస్‌లోకి వెళ్లిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వీరే - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/RJ kajal
ఆర్జే కాజల్
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'Big boss' సీజన్ 5 ఆదివారం ప్రారంభమైనట్లు ‘ఈనాడు’ కథనం ప్రచురించింది.
‘‘తొలుత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన నాగార్జున అక్కడ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఆ తర్వాత 'సీజన్-5'లో పాల్గొనే కంటెస్టెంట్లను పరిచయం చేశారు. మొత్తం 19మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లారు.
సిరి హనుమంత్ మొదటి కంటెస్టెంట్ కాగా, యాంకర్ రవి చివరిగా వెళ్లారు.
వీరితో పాటుగా సీరియల్ నటుడు సన్నీ, నటి లహరి షెహరి, ఇండియన్ ఐడల్ (సీజన్ 5) విజేత శ్రీరామ చంద్ర, డ్యాన్స్ మాస్టర్ యానీ, నటుడు మొహమ్మద్ ఖయ్యుం అలియాస్ లోబో, నటి ప్రియ, సూపర్ మోడల్, ట్రైనర్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ నటి ప్రియాంక సింగ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్, హీరోయిన్ హమీదా, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, టీవీ వ్యాఖ్యాత సరయు, నటుడు విశ్వ, సీరియల్స్ నటి ఉమ, నటుడు మానస్, ఆర్జే కాజల్, నటి శ్వేత వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు’’ అని ఆ కథనంలో రాశారు.
ఫొటో సోర్స్, janasena
మొగులయ్యకు రూ. 2 లక్షలు ఆర్థిక సహాయం అందజేసిన పవన్ కల్యాణ్
''కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు రూ. 2 లక్షలు ఆర్థికసాయం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ మేరకు చెక్కును అందజేసినట్లు'' ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్' ట్రస్ట్ తరఫున ఆయన ఈ చెక్కును అందించారు.
అనంతరం మొగులయ్యను పవన్ సత్కరించారు.
తెలంగాణ జానపద కళలపై పరిశోధనలు చేసిన డాక్టర్ దాసరి రంగాచారికి కూడా రూ. 50 వేలు చెక్కును అందజేశారు.
యాజమాన్య కోటా సీట్లు కూడా ఇక మెరిట్ విద్యార్థులకే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజనీరింగ్, తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లోని 'బీ' కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్లు కూడా ఇక మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాని సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ సీట్లను కన్వీనర్ ద్వారా భర్తీ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో 'బీ' కేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి మాత్రమే సీట్లను కట్టబెట్టేవి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లేది. గత టీడీపీ ప్రభుత్వం ఈ సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించాలన్న ఆలోచన కూడా చేయలేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 'బీ' కేటగిరీ సీట్లను మెరిట్ ప్రాతిపదికన.. పారదర్శకంగా కన్వీనర్ ద్వారా భర్తీ చేయించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గతేడాది జూలై 25న జీవో 25ను జారీ చేసింది.
అయితే కరోనాతో అడ్మిషన్లు ఆలస్యం కావడం, ఇతర కారణాలతో కాలేజీ యాజమాన్యాల వినతి మేరకు వారే భర్తీ చేసుకునేందుకు అనుమతించింది.
ఈ విద్యా సంవత్సరంలో మాత్రం కన్వీనర్ ద్వారానే భర్తీ చేసేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర కొన్ని సవరణలతో తాజాగా జీవో 48 విడుదల చేశారు.
దీని ప్రకారం.. ఈ యాజమాన్య కోటా సీట్లను కూడా కన్వీనర్ నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా ('ఏ' కేటగిరీ) సీట్లు కాగా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయ’’ని 'సాక్షి' తెలిపింది.
ఫొటో సోర్స్, AFP
మరో మూడు రోజులు మస్తు వానలు
రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినట్లు 'వెలుగు' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
సోమవారం అరెంజ్ అలర్ట్, మంగళవారం రెడ్ అలర్ట్ (అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు) జారీ చేసినట్లు పేర్కొంది.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడవచ్చని చెప్పింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు పడినట్లు పేర్కొంది.
కామారెడ్డిలోని నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్లలోని బోయిన్‌పల్లిలో 15, కామారెడ్డిలోని మాచారెడ్డి, సిద్ధిపేటలోని కొండపాకలో 11, వికారాబాద్‌లోని మోమిన్‌పేట్, సంగారెడ్డిలోని నాయకల్, కరీంనగర్‌లోని గంగాధరలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయిందని వెల్లడించింది.
ఈ సీజన్లో సాధారణం కన్నా 32 శాతం ఎక్కువగా వానలు పడినట్లు 'వెలుగు' రాసింది.
ఇవి కూడా చదవండి:
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)