మానసిక ఆరోగ్యం:
ముఖ్యమైన కథనాలు
డిప్రెషన్‌ను గుర్తించడం ఎలా? దీని లక్షణాలు ఏంటి? దీన్నుంచి ఎలా బయటపడాలి?
‘భారత్‌లో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి సత్వర వైద్య సహాయం అందించాల్సిన అవసరముంది’
కరోనావైరస్ - మానసిక ఆరోగ్యం: ఏకాగ్రతపై లాక్డౌన్ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?
దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారా? ఇది మీ ఒక్కరి సమస్యేమీ కాదు. కరోనావైరస్ లాక్‌డౌన్‌తో పెరిగిన మానసిక ఆందోళన జ్ఞాపకశక్తిని దెబ్బ తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
బైపోలార్ డిజార్డర్: ఆత్మహత్యకు పురిగొల్పే మానసిక వ్యాధి
ఎదిగే దశలో ఉన్న పిల్లల్లో విపరీతమైన కోపం, దూకుడుతనం, నిద్ర రాకపోవడం, ఎక్కువగా మాట్లాడటం, విపరీతంగా డబ్బు ఖర్చుచేయడం, సాధారణంకంటే ఎక్కువ లైంగిక వాంఛలు కనిపిస్తాయి
మీరు కరోనాసోమ్నియాతో బాధపడుతున్నారా? దీన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసా?
కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనికి నిపుణులు కరోనాసోమ్నియా లేదా కోవిడ్ సోమ్నియా అనే పేరును పెట్టారు. దీనిని ఎదుర్కోవడం ఎలా?
‘తినేవి కంపు కొడుతున్నాయి, చెత్త పదార్థాల వాసన కమ్మగా ఉంటోంది... ఎందుకిలా?'
ఈ సమస్య ఎందుకు వస్తోంది? దీన్ని ఎలా నయం చేయాలి? అనే విషయంపై శాస్త్రవేత్తలు స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు.
నియోమి ఒసాకా: 'మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే మీడియాతో మాట్లాడలేదు'
ప్రపంచంలోనే అగ్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణుల్లో రెండవ స్థానంలో ఉన్న నియోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగడం క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. కానీ, క్రీడాకారులు కూడా రకరకాల ఆందోళనలకు గురవుతూ ఉంటారని స్పోర్ట్స్ మానసిక నిపుణురాలు ఫ్రాన్సెస్కా కవాలెరియో అంటున్నారు.
‘ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’
గోవా ట్రిప్ కోసం మేం డబ్బులు దాచుకున్నాం. ఈ ఏప్రిల్‌లోనే గోవాకి వెళ్లి, అక్కడి బీచ్‌లో ఆడుకోవాలని అనుకున్నాం. అందరి జంటల్లానే గోవా బీచ్‌లో ఫోటోలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆయనే లేరు.
చల్లని నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అయిపోతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
వణికించే చలిలో చల్లని నీటిలో మునిగి తేలడమంటే కష్టమైన విషయమే. కానీ, శరీరాన్ని ఒక నిమిషం నుంచీ 90 సెకండ్ల పాటు చన్నీటిలో ముంచి తేల్చడం ద్వారా అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటపడేయటమే కాకుండా, రోగ నిరోధక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
ఆత్మహత్య చేసుకోవాలనుందని ఎవరైనా అంటే మనం ఏం చేయాలి?
‘నిజానికి వాళ్లు తమ బాధను బయట పెట్టారంటే, సాయం కోసం చూస్తున్నట్లే లెక్క. ఏ భావనలైనా తాత్కాలికమే. వారిని వాటి నుంచి బయటకు వచ్చేలా చేయడం ముఖ్యం’
'రేప్ నుంచి కోలుకున్నాక... టీవీలో అలాంటి దృశ్యాలు కనిపిస్తే భయానకంగా ఉంటోంది...'
నేను నా శక్తికి మించి పోరాడాను. దాంతో అతను నన్ను అత్యాచారం చేసినట్లు అధికారికంగా నమోదు అయింది. నాకు తిరిగి శక్తి వచ్చినట్లయింది.
‘ఒకవైపు లాక్డౌన్.. మరోవైపు కరోనా భయం.. ఇవి చాలవన్నట్లు బాయ్‌ఫ్రెండ్ గోల..’
ఒక వైపు కోవిడ్-19 సోకుతుందేమోననే భయం.. మరోవైపు ఇంట్లో పెద్దవారికి ఏదైనా అనారోగ్యం చుట్టుముడితే వైద్యం ఎలా అందుతుందనే ఆందోళన.. ఇంకోవైపు బంధువులకు ఆపద సంభవిస్తే సహాయం చేయలేని అశక్తత, ముసురుకున్న ఒంటరితనం లాంటి సమస్యలు లాక్డౌన్ సమయంలో చాలా మందిని మానసిక ఒత్తిడికి గురి చేశాయి.
‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
కోవిడ్ సెకండ్ వేవ్ ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎందరో.
బ్రెయిన్ ఫాగ్: ‘దీని బాధితులు చాలామంది ఉన్నారు కానీ ఆ విషయం వారికే తెలియదు’
మీ పర్స్ లేదా తాళాలు ఎక్కడ పెట్టారో తరచూ మర్చిపోతున్నా లేదా షాపుకెళ్లిన తర్వాత ఏం కొనాలో తెలియక తికమకపడుతున్నా.. లేదంటే దేనిమీద ధ్యాస పెట్టలేకపోతున్నా మీకు కూడా బ్రెయిన్ ఫాగ్ ఉందేమోనని అనుమానించాలి.