లాన్స్‌నాయక్ సాయితేజ: హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు సైనికుడు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయారు.
బిపిన్ రావత్ భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.
ఆ 11 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయితేజ కూడా ఉన్నారు.
సాయితేజది చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం.
రక్షణ శాఖలో సాయితేజ లాన్స్‌నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సాయితేజ ఒకరు.
ఫొటో సోర్స్, ugc
సాయితేజ కుటుంబం
2013లో ఆర్మీలో జాయిన్ అయ్యారు సాయితేజ.
సాయితేజ సోదరుడు కూడా ఆర్మీలోనే ఉన్నారు.
సాయితేజ్‌కు భార్య శ్యామల (26), కుమారుడు మోక్షజ్ఞ (5) కుమార్తె దర్శిని (2) ఉన్నారు.
లాన్స్ నాయక్ సాయితేజ మృతిపై ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- సీడీఎస్ బిపిన్ రావత్: విమానం,హెలీకాప్టర్లలో ప్రయాణించే ముందు ఆర్మీ అధికారులు పాటించాల్సిన 7 నిబంధనలేంటి?
- హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
- Mi-17 V5: వీవీఐపీలు వాడే హెలికాప్టర్ ఇది, దీని ప్రత్యేకతలేంటి?
- జనరల్ బిపిన్ రావత్: గూర్ఖా రైఫిల్స్ నుంచి తొలి సీడీఎస్ వరకు..
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?
- గర్భిణి తల నరికి దారుణంగా హత్య చేసిన తల్లి, తమ్ముడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)