బిపిన్ రావత్‌తోపాటు మరణించిన 11 మంది సైనికులు వీరే

ఫొటో సోర్స్, ANI
భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్.. తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
ఆ హెలికాప్టర్‌లో మొత్తంగా 14 మంది ప్రయాణించారు. వీరిలో 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్‌పై పెట్టి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో బిపిన్, రావత్, మధులికలతోపాటు మరణించినవారిలో 11 మంది సైనికులు ఉన్నారు. వారి వివరాలు..
సైన్యం
ఫొటో సోర్స్, ANI
బ్రిగేడియర్ లఖ్‌బిందర్ సింగ్ లిడ్డర్
బ్రిగేడియర్ లఖ్‌బిందర్ సింగ్ లిడ్డర్
హరియాణాలోని పంచ్‌కుల ఆయన స్వస్థలం. బిపిన్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఆయన పనిచేశారు.
లఖ్‌బిందర్‌కు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాళులు అర్పిస్తూ.. ''కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన పంచ్‌కుల వీరుడు బ్రిగేడియర్ లఖ్‌బిందర్ సింగ్ లిడ్డర్‌కు నివాళులు అర్పిస్తున్నా. ఆయన కుటుంబానికి దేవుడి అండగా నిలబడాలి''అని ట్వీట్‌చేశారు.
మరోవైపు ఒలింపిక్ పతక విజేత, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ కూడా లఖ్‌బిందర్ సింగ్‌కు నివాళులు అర్పించారు.
''మేం ఎన్‌డీఏలో కలిసే శిక్షణ తీసుకున్నాం. కశ్మీర్‌లో ఉగ్రవాదులపై కలిసే పోరాడాం. నేడు భారత్ గొప్ప సైన్యాధికారిని కోల్పోయింది. నేను కూడా మంచి మిత్రుడిని కోల్పోయాను. ఆయన మంచి తంద్రి, మంచి భర్త, మంచి సైనికుడు. మీ లోటు భర్తీ చేయలేనిది టోనీ''అని రాఠోడ్ ట్వీట్‌చేశారు.
ఈ ప్రమాదంలో మరణించిన మిగతా అందరి సైనికులకూ రాఠోడ్ నివాళులు అర్పించారు.
ఫొటో సోర్స్, ANI
లెఫ్టినెంట్ కల్నల్ హర్‌జిందర్ సింగ్
లెఫ్టినెంట్ కల్నల్ హర్‌జిందర్ సింగ్
రాజస్థాన్‌లోని అజ్‌మేర్ హర్‌జిందర్ స్వస్థలం. రావత్‌కు స్టాఫ్ ఆఫీసర్‌గా ఆయన పనిచేశారు.
ఫొటో సోర్స్, ANI
లాన్స్‌నాయక్ వివేక్ కుమార్
లాన్స్‌నాయక్ వివేక్ కుమార్ - 1 పారా (స్పెషల్ ఫోర్సెస్) - జనరల్ రావత్ పీఎస్‌వో
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా వివేక్ స్వస్థలం.
వివేక్‌కు నివాళులు అర్పిస్తూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది.
''తమిళనాడులోని హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో జైసింగ్‌పూర్‌కు చెందిన లాన్స్ నాయక్ వివేక్ కుమార్ కూడా ఉన్నారు. ఆయనకు మేం నివాళులు అర్పిస్తున్నాం. ఆయన కుటుంబానికి దేవుడు అండగా నిలబడాలి.''
ఫొటో సోర్స్, ANI
నాయక్ గురుసేవక్ సింగ్
నాయక్ గురుసేవక్ సింగ్ - 9 పారా (స్పెషల్ ఫోర్సెస్)
గురుసేవక్ స్వస్థలం పంజాబ్‌లోని తరన్‌తారణ్.
ఫొటో సోర్స్, ANI
లాన్స్‌నాయక్ బి సాయితేజ
లాన్స్‌నాయక్ బి సాయితేజ - 11 పారా (స్పెషల్ ఫోర్సెస్)
సాయితేజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు.
ఫొటో సోర్స్, ANI
నాయక్ జితేంద్ర కుమార్
నాయక్ జితేంద్ర కుమార్ - 3 పారా (స్పెషల్ ఫోర్సెస్)
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా ధామందా గ్రామం.. జితేంద్ర స్వస్థలం.
31ఏళ్ల జితేంద్రకు నాలుగేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నాడు. జితేంద్ర ఇంటికి సీహోర్ జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు.
ఫొటో సోర్స్, ANI
హవిల్దార్ సత్‌పాల్ రాయ్
హవిల్దార్ సత్‌పాల్ రాయ్
పశ్చిమ బెంగాల్‌లోని దార్జీలింగ్ సత్‌పాల్ స్వస్థలం. రావత్‌కు పీఎస్‌వోగా ఆయన పనిచేశారు.
వైమానిక దళం..
సైన్యానికి చెందిన వారితోపాటు నలుగురు వైమానిక దళ జవాన్లు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
ఫొటో సోర్స్, ANI
వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్
వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్
కుప్పకూలిన ఆ హెలికాప్టర్‌ను నడిపింది వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్. సులూర్‌లోని 109 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన కమాండర్ ఆఫీసర్ అయిన చౌహాన్ స్వస్థలం రాజస్థాన్‌లోని జైపుర్. అయితే, ఏళ్ల క్రితమే ఆయన కుటుంబం ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు వలస వెళ్లిందని బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు మొహర్ సింగ్ మీనా చెప్పారు. ప్రస్తుతం చౌహాన్ కుటుంబం ఆగ్రాలో నివసిస్తోంది.
ప్రస్తుతం చౌహాన్ ఇంటికి ఆయన బంధువులు, ఆప్తులు పెద్దయెత్తున వస్తున్నారని స్థానిక జర్నలిస్టు నసీమ్ అహ్మద్ వివరించారు.
తనకు చౌహాన్ ఒక్కడే కుమారుడని 72ఏళ్ల అతడి తండ్రి సురేంద్ర సింగ్ తెలిపారు. 2007లో పృథ్వీ సింగ్ చౌహాన్‌కు కామినీతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
రేవా సైనిక్ పాఠశాలలో చౌహాన్ చదువుకున్నారు. 2000లో ఆయన వైమానిక దళంలో చేరారు. కోయంబత్తూరు వైమానిక కేంద్రంలో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. హైదరాబాద్, గోరఖ్‌పూర్, ఉధమ్‌సింగ్ నగర్, జామ్‌నగర్, అండమాన్ అండ్ నికోబార్‌లలో ఆయన సేవలు అందించారు.
ప్రత్యేక శిక్షణ కోసం ఆయన సూడాన్ కూడా వెళ్లొచ్చారు.
ఫొటో సోర్స్, @SachinPilot
స్వ్కాడ్రన్ లీడర్ కుల్‌దీప్ సింగ్
స్వ్కాడ్రన్ లీడర్ కుల్‌దీప్ సింగ్
కుప్పకూలిన హెలికాప్టర్‌కు కో-పైలట్‌గా కుల్‌దీప్ వెళ్లారు. రాజస్థాన్‌లోని ఝుంఝునూ ఆయన స్వస్థలం.
ఫొటో సోర్స్, ANI
రాణా ప్రతాప్ దాస్
జేడబ్ల్యూవో రాణా ప్రతాప్ దాస్
ఒడిశాలోని తాల్చెర్ ఈయన స్వస్థలం.
రాణా ప్రతాప్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైందని బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు సందీప్ సాహూ తెలిపారు. రాణాకు రెండేళ్ల కుమార్తె ఉంది.
ఫొటో సోర్స్, ANI
జేడబ్ల్యూ ప్రదీప్
జేడబ్ల్యూ ప్రదీప్
కేరళలోని తిరుచ్చి ప్రదీప్ స్వస్థలం.
ఇవి కూడా చదవండి:
- హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి
- Mi-17 V5: వీవీఐపీలు వాడే హెలికాప్టర్ ఇది, దీని ప్రత్యేకతలేంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్రం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)