‘బిపిన్ ఎంత ఎదిగినా స్నేహితులను మర్చిపోలేదు’

‘బిపిన్ ఎంత ఎదిగినా స్నేహితులను మర్చిపోలేదు’

‘‘బిపిన్ రావత్ రెండు సార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఒకసారి ఆయన ధైర్యాన్ని చూసి మేమే ఆశ్చర్య పోయాం. ప్రమాదం తరువాత ఆయన చిరునవ్వుతో .. నాకు ఇంకా టైం రాలేదు లే, అప్పుడే వెళ్లిపోను అన్నారు'' అంటూ సికింద్రాబాద్‌లో నివసిస్తున్న రిటైర్డ్ కల్నల్ పీవీ దుర్గాప్రసాద్ బీబీసీతో చెప్పారు.

దుర్గాప్రసాద్, బిపిన్ రావత్‌లు చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పనిచేశారు.

తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో తన మిత్రుడు బిపిన్ చనిపోవడంపై ఆవేదన చెందిన దుర్గాప్రసాద్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని 'బీబీసీ'తో పంచుకున్నారు.

''దేశం కోసం ఏదైనా చేయాలనే తపన, ధైర్యం బిపిన్‌ను ఈ స్థాయికి తీసుకెళ్లింది'' అని చెప్పిన దుర్గాప్రసాద్ ఆర్మీ పట్ల బిపిన్‌ రావత్‌కు ఉన్న అంకితభావం, స్నేహితుల పట్ల ఆప్యాయతనూ వివరించారు.

మిత్రుడు బిపిన్ రావత్ గురించి దుర్గాప్రసాద్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)