కాశీ ఆలయం ఇప్పుడెలా ఉందో చూడండి

కాశీ ఆలయం ఇప్పుడెలా ఉందో చూడండి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టు శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను సోమవారం వారణాసి‌లో ప్రారంభించారు.

వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మొదట కాల భైరవ ఆలయంలో హారతి ఇచ్చారు. తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లడానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకూ డబుల్ డెకర్ బోటులో ప్రయాణించారు.

గంగా నదీ తీరాన ఘాట్ల దగ్గర ఉన్న జనాలకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. లలితా ఘాట్ చేరుకున్న తర్వాత ప్రధాని కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. తర్వాత ఆయన కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టును ప్రారంభించారు.

కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రత్యేకతలేంటి.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)