‘నా భర్త తిరిగొచ్చాడు.. నేను దేశం వదిలి పారిపోయా..’

‘నా భర్త తిరిగొచ్చాడు.. నేను దేశం వదిలి పారిపోయా..’

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఎంతో మంది మహిళలు ఆ దేశం వీడుతున్నారు. కొందరు మహిళల హక్కులు, స్వతంత్ర్యం తగ్గిపోతాయనే భయంతో దేశం నుంచి పారిపోతున్నారు.

సోరా ఒక మెడికల్ ప్రొఫెషనల్. ఆమె కూడా దేశం వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కనీసం తన తల్లిదండ్రులకు కూడా ఆమె చెప్పలేదు. వారికి వీడ్కోలు కూడా పలకలేదు.

ఆమె పారిపోవడానికి కారణం.. తాలిబాన్ల సానుభూతి పరుడైన ఆమె భర్త. గతంలో ఆమెను విడిచివెళ్లిపోయిన అతను మళ్లీ తాలిబాన్ల పాలన నేపథ్యంలో తిరిగొచ్చాడు. హింసాత్మకంగా ప్రవర్తించే అతను తన జీవితంలోకి, తన ప్రమేయం లేకుండానే అడుగుపెట్టాడని, అందుకే తాను పారిపోవాల్సి వచ్చిందని సోరా బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)