కోడలికి ఘనంగా రెండో పెళ్లి చేసిన అత్త
రాజస్థాన్ అనగానే పరదా వ్యవస్థ, లింగ నిష్పత్తిలో తేడాకు ప్రసిద్ధం. ఇక అక్కడ వితంతు పునర్వివాహాల ఆలోచన ఇంకా కష్టం. అయితే, కొడుకు చనిపోవడంతో ఓ తల్లి తన కోడలికి స్వయంగా రెండో వివాహం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
27 ఏళ్ల సునీత ఆరేళ్ల కిందట ఆ ఇంటికి కోడలిగా వచ్చారు.
కానీ ఇప్పుడు అదే ఇంటి నుంచి కూతురుగా కాపురానికి వెళ్లారు.
అత్త, మామలు స్వయంగా ఆమెకు దగ్గరుండి వివాహం జరిపించారు.
2016లో సునీత రాజస్థాన్‌లోని సికర్ జిల్లా ధన్‌ధాన్ గ్రామానికి కోడలుగా వచ్చారు.
పెళ్లయిన కొన్ని నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆమె భర్త చనిపోయారు.
భర్త చనిపోయే నాటికి సునీత వయసు 21 ఏళ్లు.
సునీత అంగీకారంతో అత్తమామలు ఆమెను చదవించారు.
భర్త కుటుంబం సహకారంతో ఐదేళ్లపాటు సునీత చదువుకున్నారు.
చూరు జిల్లాలో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించారు.
సికార్‌లో నివసించే ముకేశ్ మవాలియాను సునీత వివాహం చేసుకున్నారు.
ముకేశ్ ప్రభుత్వాధికారి. ప్రస్తుతం భోపాల్‌లో పని చేస్తున్నారు.
ఆయన మొదటి భార్య రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు.
పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ వివాహం తమ సమాజంలో ఒక సానుకూల పరిణామం అన్నారు ముకేశ్.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)