అస్సాం వరదల్లో కొట్టుకుపోయిన రైలు, ఏనుగు
దేశంలో ఒకవైపు హీట్‌వేవ్ విజృంభిస్తుంటే.. మరోవైపు అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అస్సాంలో వరదల వల్ల నాలుగు లక్షల మందికిపైగా ప్రజలపై ప్రభావం పడుతోంది. 26 జిల్లాల్లోని వెయ్యికిపైగా గ్రామాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది.
వరదల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు, రైలు మార్గాలకు అంతరాయం ఏర్పడుతోంది.
మే 24 వరకు గువాహాటి నుంచి సిల్‌చర్, అగర్తలాలకు వెళ్లే రైళ్లను రైల్వే రద్దుచేసింది.
కొండ చరియలు విరిగిపడటం, వరదలతో గువాహాటి-సిల్‌చర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. హాఫ్‌లోగ్ రైల్వే స్టేషన్‌లో పక్కకు ఒరిగిపోయింది.
మరోవైపు డిటోకచేరా రైల్వే స్టేషన్‌లో మరో ప్రయాణికుల రైలు కూడా ఇలానే మధ్యలోనే నిలిచిపోయింది.
వైమానిక దళం సాయంతో 2400 మంది ప్రయాణికులను కాపాడినట్లు ఎన్‌ఎఫ్ రైల్వే సీపీఆర్‌వో సవ్యసాచి డే తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)