రోహింగ్యాలు: ‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’

రోహింగ్యాలు: ‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’

మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో గత ఆగస్టులో హింస రాజుకుంది. అప్పటినుండీ దాదాపు 1,50,000 మంది రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కి పారిపోయారు. బంగ్లాదేశ్‌లో శరణార్థి శిబిరాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’గా ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అభివర్ణించిన రోహింగ్యాలు ఎన్నో ఏళ్లుగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

బీబీసీ ప్రతినిధులు షాలూ యాదవ్, నేహా శర్మలు బంగ్లాదేశ్ – మయన్మార్ సరిహద్దులో ఈ శరణార్థులను కలిశారు. వారి అస్తిత్వ సమస్య గురించి ఆరా తీశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి)