సూచీ గౌరవ డిగ్రీ అందుకొన్నకళాశాలలోనే చిత్రపటం తొలగింపు

  • 1 అక్టోబర్ 2017
ఆంగ్ సాన్ సూచీ Image copyright JONATHAN NACKSTRAND/AFP/Getty Images

రోహింగ్యాల సంక్షోభాన్ని సమర్థంగా పరిష్కరించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నతరుణంలో మయన్మార్ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూచీ చిత్రపటాన్ని బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తొలగించింది.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిధిలోని అతిపెద్ద కళాశాలల్లో సెయింట్ హ్యూగ్స్ కాలేజ్ ఒకటి.

1967లో ఈ కళాశాలలో సూచీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2012లో ఇదే కళాశాల నుంచి గౌరవ డిగ్రీ అందుకున్నారు. ఇప్పుడు ఇదే కళాశాల ఆమె చిత్రపటాన్ని తొలగించింది. దీని స్థానంలో ఒక జపాన్ పెయింటింగ్‌ను ఉంచినట్లు కళాశాల తెలిపింది.

ఇవి కూడా చూడండి

రోహింగ్యా ముస్లింలతో మాట్లాడాలనుకుంటున్నా: సూచీ

'రోహింగ్యాలు మా దేశస్తులే కారు'

సూచీ చిత్రపటం తొలగింపునకు కారణాలు స్పష్టం కాలేదు. దీనిని సురక్షిత ప్రదేశంలో ఉంచినట్లు కళాశాల తెలిపింది.

మయన్మార్‌లో రోహింగ్యాలు లక్ష్యంగా సాగుతున్న హింసతో నాలుగు లక్షల మందికి పైగా రోహింగ్యా ముస్లింలు తలదాచుకొనేందుకు బంగ్లాదేశ్‌కు తరలిపోయారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా