యుద్ధం వస్తే ఉత్తర కొరియా అణ్వాయుధం ఎప్పుడు వాడొచ్చు?

అణు రాజ్యం కావాలన్న తమ ఆకాంక్ష తాజాగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణితో నెరవేరిందని ఉత్తర కొరియా చెబుతోంది.

అమెరికా మొత్తంలో ఎక్కడికైనా చేరుకోగల కొత్త తరహా ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది.

గత కొంత కాలంగా ఇలాంటి క్షిపణి పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరికలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉత్తర కొరియాతో యుద్ధం వస్తే.. అదెలా ఉంటుంది? అన్న అంశంపై అమెరికాకు చెందిన ఇద్దరు నిపుణులు బీబీసీతో మాట్లాడారు.

యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది? ఉత్తర కొరియా వ్యూహాలు ఎలా ఉండొచ్చు? అణ్వాయుధాన్ని ఎప్పుడు వాడొచ్చు? అన్న అంశాలతో పాటు వారి శక్తి సామర్థ్యాలు, తదనంతర పరిణామాలపై మాట్లాడారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)