లాస్‌ వెగాస్ కాల్పులు: 'మా నాన్న బ్యాంకు దోచుకున్నాడు'

  • 3 అక్టోబర్ 2017
స్టీఫెన్ పడాక్ Image copyright CBS News

సంగీత విభావరిలో కాల్పులకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న నెవడాకు చెందిన 64 ఏళ్ల స్టీఫెన్ పడాక్ ధనవంతుడు. అతను ఒకప్పుడు అకౌంటెంట్‌గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత సాధారణ జీవితం గడుపుతున్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు చెబుతున్నారు.

పడాక్‌కు పైలట్, వేటాడే గన్ లైసెన్స్ ఉన్నాయి. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, మానసిక సమస్యలు కూడా ఏమీ లేవని అధికారులు చెప్తున్నారు. అయితే, అతనొక ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ అని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు.

కాల్పులు జరపడానికి ఒంటరి తనమే కారణం అయి ఉండొచ్చని లాస్ వెగాస్ పోలీసు అధికారి జోయి లాంబార్డో అభిప్రాయపడ్డారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకాల్పులు జరుగుతున్నప్పుడు ప్రేక్షకులంతా తలోదిక్కున దాక్కున్నారు

జనంపై కాల్పులు జరిపిన తర్వాత స్టీఫెన్ పడాక్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతను ఉన్న హోటల్‌ రూమ్‌ నుంచి 16 తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అతని ఇంట్లో పేలుడు పదార్థాలు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. పడాక్‌ కారులో అమ్మోనియం నైట్రేట్‌ ఉన్నట్లు గుర్తించారు. మరో ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

స్టీఫెన్‌ పడాక్‌ సీనియర్ సిటిజన్. లాస్ వెగాస్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం మెస్‌క్వైట్‌లో ఒక మహిళతో కలిసి ఉండేవాడు. ప్రస్తుతం ఆ మహిళ జపాన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈ కాల్పులకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు. స్టీఫెన్ పడాక్ సెప్టెంబరు 28 నుంచి మాండలే బే హోటల్‌‌లో ఉంటున్నాడు.

Image copyright BBC/LAURA BICKER
చిత్రం శీర్షిక పడాక్ ఇంట్లో పేలుడు పదార్థాలు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు సీజ్ చేశారు

ఈ ఏడాదే తుపాకులు కొన్నాడు..

పడాక్ ఈ ఏడాదే నార్త్ లాస్ వేగాస్ లోని తన దుకాణంలో తుపాకులు కొన్నారని న్యూ ఫ్రంటైర్ ఆర్మరీకి చెందిన డేవిడ్ ఫమిగ్లెట్టి బీబీసీతో చెప్పారు. అతను అన్ని అనుమతులూ చూపించాడని, ఎఫ్‌బీఐ అనుమతి పత్రం కూడా వాటిలో ఉందని తెలిపారు. అయితే, పడాక్ కొనుగోలు చేసిన తుపాకులకు, సంఘటనా స్థలంలో వినిపించిన తుపాకుల శబ్దానికీ పోలిక లేదని, వాటికి అంత సామర్థ్యం ఉండదని వివరించారు.

కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్‌ ప్రకటించుకున్నప్పటికీ.. పడాక్‌కు విదేశీ ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతన సోదరుడే అనుమానిత నిందితుడని పోలీసులు ప్రకటించటంతో షాక్ తిన్నానని ఎరిక్ పడాక్ చెప్పారు

'తండ్రి బ్యాంకు దోచుకున్నాడు'

తమ తండ్రి పాట్రిక్ బెంజమిన్ పడాక్ ఒకప్పుడు బ్యాంకును దోచుకున్నాడని స్టీఫెన్ పడాక్ సోదరుడు ఎరిక్ పడాక్ చెప్పారు. బెంజమిన్ 'చికిత్స పొందిన మానసిక రోగి' అని 1969లో పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌ని బట్టి తెలుస్తోంది.

లాస్ వేగాస్ ఘటనలో తన సోదరుడి పాత్ర ఉందంటూ ఆరోపణలు రావటంతో తమ కుటుంబం కంగుతిన్నదని ఓర్లాండోలోని తన నివాసం వద్ద ఎరిక్ విలేకరులకు తెలిపారు. తన సోదరుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనేందుకు ఆధారాలు ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన సోదరుడు సాధారణ వ్యక్తి అని, వీడియో పోకర్ ఆడుకుంటూ, బోటు షికార్లు చేసేవాడని తెలిపారు.

Image copyright CBS NEWS
చిత్రం శీర్షిక పడాక్ పక్కన ఉన్నా లేనట్టేనని ఆయన పొరుగింటి వాళ్లు చెప్పారు

నెవడా చట్టాలు ఏం చెబుతున్నాయి?

నెవడాలో ఎవరైనా ఆయుధాలు కొనుక్కోవచ్చు. లైసన్స్ కూడా అవసరం లేదు. గన్ కొనేప్పుడు ఎంక్వైరీ చేస్తారు. కానీ ప్రైవేటుగా కూడా గన్స్ అమ్ముకోవచ్చు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు