అమెరికాలో తుపాకుల మోతను ఆపలేరా?

  • 15 ఫిబ్రవరి 2018
తుపాకుల దుకాణం Image copyright Getty Images

అమెరికాలో అమాయక ప్రజలపై తూటా పేలిన ప్రతిసారీ ఒక గళం బలంగా వినిపిస్తుంది. అరాచక శక్తుల చేతుల్లో ఆయుధాలు పడకుండా తుపాకుల వినియోగానికి కళ్లెం వేయాలని. తాజాగా కాల్పుల ఘటన ఈ గొంతులకు మరింత బలాన్నిచ్చింది.

తుపాకీ వినియోగాన్ని కఠినతరం చేస్తూ చట్టాలను సవరించాలని చాలా కాలంగా ఎంతో మంది ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. శక్తిమంతమైన ఆయుధాలను వాడకుండా నిషేధించాలని కోరుతున్నారు. అనుమతులు జారీ చేసేటప్పడు వ్యక్తుల నేపథ్యాన్ని నేర చరిత్రను పరిశీలించాలని విన్నవించుకుంటున్నారు. మరి ఈ తుపాకీ సంస్కృతిని ఎందుకు నిరోధించలేక పోతున్నారు? ఇందుకు అడ్డుపడుతున్న శక్తులు ఏమిటి?

ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్

ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) ఎంతో శక్తిమంతమైన సంస్థల్లో ఒకటి. అమెరికా దేశ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 50 లక్షలు. కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులు దీని వెనుక బలమైన శక్తులుగా ఉన్నారు. రాజకీయాల్లో తమ అనుకూల వర్గాలను అందలం ఎక్కించడం, వ్యతిరేకించే వారిని పాతాళానికి తొక్కడం ఈ కింగ్ మేకర్లకు వెన్నతో పెట్టిన విద్య.

Image copyright David Becker/getty images
చిత్రం శీర్షిక లాస్ వెగాస్‌ కాల్పుల ఘటనా స్థలంలోని ఓ దృశ్యం

తాము చెప్పినట్లు వినేలా ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల చేతులు తడుపుతోంది ఈ సంస్థ. 2016లో ఇందుకు సుమారు రూ.27 కోట్లు (4 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. రాజకీయ ప్రచారాలకు దాదాపు రూ.330 కోట్లు (50 మి.డాలర్లు), డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు రూ.200 కోట్లు (30 మి.డాలర్లు) వెచ్చించినట్లు అంచనా.

ఇలాంటి కార్యక్రమాల కోసం ఎన్ఆర్ఏ ఏడాదికి సుమారు రూ.1700 కోట్లు (250 మి.డాలర్లు) కేటాయిస్తుంది. ఆయుధాల నిరోధానికి బలమైన చట్టాలు తీసుకురాకుండా తరచూ అడ్డకుంటూ ఉంటుంది. దీనికి మద్దతు పలికే సభ్యుల సంఖ్య చట్ట సభల్లో పెరుగుతూ ఉన్నంత కాలం ఎన్ఆర్ఏదే పై చేయిగా ఉంటుంది.

ఓట్ల లెక్కలు!

ప్రజా ప్రతినిధుల్లో కొందరు తుపాకీ సంస్కృతికి అండగా ఉండేందుకు ఓట్ల లెక్కలు కూడా కారణమవుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు. గ్రామీణులు ఎక్కువగా ఉండే న్యూయార్క్, కాలిఫోర్నియాతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి ఎన్నికయ్యే ప్రతినిధులు ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా నడచుకోవాల్సి ఉంటుంది.

Image copyright MARK RALSTON/getty images

కాల యాపనతో సరి..

అమెరికా ఎగువ సభ (సెనేట్) ఆమోదానికి ఆయుధాల నియంత్రణ బిల్లులు నోచుకోవడం లేదు. సభలో చర్చకు వచ్చినప్పుడల్లా బిల్లులను వ్యతిరేకించే వర్గం కావాలనే ఊక దంపుడు ప్రసంగాలతో కాలయాపన చేస్తున్నారు. దీనితో ఆమోదానికి నిర్దేశించిన పుణ్యకాలం కాస్తా గడిచిపోయి బిల్లులు మోక్షం పొందకుండానే మూలన పడిపోతున్నాయి.

2013 తరువాత వరుసగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలతో బిల్లుల ఆమోదానికి మద్దతు పెరిగినా ఎన్ఆర్ఏ ప్రభావంతో పూర్తి మెజారిటీ ఇంకా లభించడం లేదు.

ఇవి కూడా చదవండి...

లాస్ వెగాస్‌ కాల్పుల్లో 58 మంది మృతి

లాస్‌ వెగాస్ కాల్పులు: 'ఈ ఏడాదే తుపాకులు కొన్నాడు'

న్యాయస్థానాలు..

ఆయుధాల నియంత్రణ బిల్లులకు న్యాయస్థానాల తీర్పులు కూడా అవరోధంగా నిలుస్తున్నాయి. అమెరికాలో ప్రతి పౌరుడు తుపాకీని కలిగి ఉండే హక్కును రాజ్యంగం కల్పిస్తోందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించి అనుమతులు జారీ చేయడంలో కానీ, కొనుగోలుకు కానీ కఠిన నిబంధనలు ఉండరాదని నిర్దేశించింది. ఈ తీర్పును అనుసరించి దిగువ కోర్టులు సైతం తుపాకుల నియంత్రణపై రాష్ట్రాలు తీసుకొచ్చే కఠిన నిబంధనలను కొట్టి వేస్తున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకాల్పులతో మాన్డలే బే హోటల్ ప్రాంగణం నుంచి భయాందోళనతో పరుగులు తీస్తున్న ప్రజలు (ఇకీ హ్రాఫన్‌సన్ అనే వ్యక్తి కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు.)

ఆ సమయం ఎప్పుడు..?

ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ తుపాకులు ఉన్నవారు మాత్రం తమ విశ్వాసాలను వదులుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తుపాకుల నియంత్రణకు కఠినమైన చట్టాలను తీసుకు రాకుండా అడ్డుకుంటున్న ఏకైక శక్తి వీరి మనోభావాలే. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రతిసారీ ఆందోళనలు సద్దుమణిగే వరకు చట్ట సభల్లో కాలయాపన జరిగేలా ఎన్ఆర్ఏ, దీని మద్దతుదార్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

కాల్పుల ఘటనల దృశ్యాలు

'లాస్ వెగాస్' దుర్ఘటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా హెచ్ సాండర్స్ స్పందిస్తూ 'ఇది రాజకీయాలకు సమయం కాదు. దేశం మొత్తం ఏకతాటిగా నిలవాల్సిన తరుణం' అనడాన్ని ఈ కోణంలో నుంచే చూడొచ్చు. సమయం వచ్చినప్పుడు తుపాకుల నియంత్రణపై చర్చిస్తామని ట్రంప్ అనడం కూడా ఈ కోవకే చెందుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి.. ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది

కరోనావైరస్ కేసులు: టాప్‌ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది

పాకిస్తాన్ విమాన ప్రమాదం - ‘జీవితాంతం వెంటాడుతుంది’

వైజాగ్ విమానాశ్రయంలోకి ముగ్గురు ఎల్జీ పాలిమర్స్ నిపుణులు.. దేశం దాటడానికి ఎవరైనా సహకరిస్తున్నారా

ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు

వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు

ప్రధానితో కాళ్లు కడిగించుకున్న పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు