ఓటుకు నోటు కేసులో రియో ఒలింపిక్స్ అధ్యక్షుడు కార్లోస్ అరెస్టు

  • 5 అక్టోబర్ 2017
రియో 2016 ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా కార్లోస్ నుజ్మాన్ పనిచేశారు. Image copyright Reuters

బ్రెజిల్ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు కార్లోస్ నుజ్మాన్‌ను రియో డీ జెనీరోలో పోలీసులు అరెస్టు చేశారు. రియో 2016 ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా కార్లోస్ నుజ్మాన్ పనిచేశారు.

రియో ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్‌ను దక్కించుకునేందుకు కార్లోస్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కార్లోస్ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతూ వచ్చాడు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక సభ్యుడు లామినే డియాక్ మద్దతు సంపాదించేందుకు కార్లోస్ ''ఓటుకు నోటు'' లాంటి వ్యవహారం నడిపారన్న విమర్శలు వచ్చాయి.

ఓ రష్యన్‌ అథ్లెట్‌ను డోపింగ్ పరీక్ష నుంచి తప్పించేందుకు అవినీతికి పాల్పడ్డ కేసులో డియాక్‌ 2015లో అరెస్టయ్యారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన బ్రెజిల్ పోలీసులు ఫ్రాన్స్, అమెరికా పోలీసులతో కలిసి లోతుగా విచారణ జరిపారు. కార్లోస్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు.

రియో ఒలింపిక్స్ కమిటీ డైరెక్టర్ జనరల్ లియోనార్డో గ్రైనర్‌నూ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)