ఆఫ్రికా ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ఎందుకు నిర్మిస్తోంది?

ఆఫ్రికా ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ఎందుకు నిర్మిస్తోంది?

ఆఫ్రికా ఖండంలో తూర్పు నుంచి పడమర పొడవునా చెట్లతో గోడ కట్టాలని 11 దేశాలు ప్రణాళిక రచించాయి. సహారా ఎడారి దక్షిణ కొసన ఈ ‘గ్రేట్ గ్రీన్ వాల్’ను నిర్మిస్తున్నారు.

అక్కడి నేలలు ఎడారిగా మారడాన్ని తిప్పికొడుతూ వాతావరణ మార్పు ప్రభావాలపై పోరాడడం ఈ భారీ ప్రాజెక్టు లక్ష్యం. దీనిపై బీబీసీ వరల్డ్ హ్యాక్స్ రూపొందించిన వీడియో ఇది.

దాదాపు 8,000 కి.మీ. పొడవు, 15 కి.మీ. వెడల్పు ఉండే ఈ ’మహా హరిత కుడ్యం’ నిర్మాణానికి రూ. 50 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఇది పర్యావరణాన్నే కాదు ఆయా దేశాల్లో ప్రజల ఆర్థికస్థితిగతులను కూడా మెరుగుపరుస్తోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)