హ్యాకర్లు కారును కంట్రోల్ చేసే అవకాశం ఉందా ?

  • 6 అక్టోబర్ 2017
డ్రైవర్ రహిత కార్లు Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టీరింగ్ మీ చేతిలో ఉన్నా కారు మాత్రం మీ మాట వినకపోతే పరిస్థితి ఏంటీ?

ఖరీదైన అటానమస్ (స్వయం చోదక) కారులో మీరు ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ, మీ కారు మాత్రం మరెక్కడికో తీసుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితి నిజంగా వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఏ కొండ మీదకో, భారీగా ఉన్న ట్రాఫిక్ లోకి మీ ప్రమేయం లేకుండానే కారు వెళితే పరిస్థితి ఏంటీ?

ఇదంతా మీకు అతిశయంగా కనిపించొచ్చు.. కానీ, ఇలాంటి ప్రమాదం పొంచే ఉంది.

స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లే అటానమస్ కార్లను కూడా హ్యాక్ చేయోచ్చా? మన ప్రమేయం లేకుండానే హ్యాకర్లు వాటిని తమ ఆధీనంలోకి తీసుకొవచ్చా..? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు.

డ్రైవర్ రహిత కార్లను హ్యాక్ చేసే ప్రమాదం పొంచి ఉందని ఈ ఏడాది మొదట్లోనే టెస్లా కార్ల తయారీ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించారు.

''స్వయం చాలక వాహనాలను ఎవరైనా విసృతస్థాయిలో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నా'' అని ఆయన నేషనల్ గవర్నర్స్ అసోసియేషన్ సమావేశంలో పేర్కొన్నారు.

''ఎవరైనా మేం తయారు చేసే టెస్లా కార్లను హ్యాక్ చేసి ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లెలా సాఫ్ట్‌వేర్ మార్చితే ఇక అంతే సంగతులు.. ఆ రోజుతో టెస్లా శకం ముగిసినట్లే'' అని చెప్పుకొచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వైర్ లెస్ సాఫ్ట్ వేర్ తో టెస్లా తన కార్లను అప్ గ్రేడ్ చేస్తోంది. కానీ, ఇందులో ప్రమాదం పొంచి ఉందా..

సాంకేతికతతోనే సమస్య

ఇంతకీ అత్యంత భద్రతతో కూడిన అటానమస్ కార్లను ఎలా హ్యాక్ చేస్తారు?

కార్లు ఎంత ఎక్కువగా సాంకేతికతను అందిపుచ్చుకుంటుంటే వాటికి అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటోంది.

ముఖ్యంగా ఇంటర్‌నెట్‌తో అనుసంధానమయ్యే కార్లతోనే ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి కార్లే హ్యాక్‌కు గురయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి కార్లను అపగ్రేడ్ చేసే సమయంలో హ్యాకర్లు సాఫ్ట్‌వేర్ ను మార్చి కారును తమ ఆధీనంలోకి తీసుకునే ముప్పు ఉంది. అలా జరిగితే కారు మన చేతిలో ఉన్నా స్టీరింగ్ మాత్రం వాళ్ల చేతిలో ఉన్నట్లే. అప్పుడు హ్యాకర్లు చెప్పినట్లే కారు వెళుతుంది.. మనం మాత్రం చల్లటి ఏసీ కారులో ప్రాణభయంతో చెమటలు కక్కాల్సిందే.

అయితే ఇలాంటి అవకాశం హ్యాకర్లకు ఇవ్వకుండా ఉండాలంటే వారికంటే మీరు చాలా 'స్మార్ట్' గా ఉండాలి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికే కారు తీసుకెళుతోందని మీరు నిశ్చింతగా ఉండగలరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)