లాటిన్ అమెరికాలో నేట్ విధ్వంసం

  • 6 అక్టోబర్ 2017
తుపానులో ఇల్లు ధ్వంసం కావడంతో మిగిలిన సామాన్లు ఇలా తీసుకెళ్తున్నారు Image copyright Reuters
చిత్రం శీర్షిక కోస్టారికాలో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి

నికరాగ్వే, కోస్టారికాలో కుండపోత వర్షం కురిసింది. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కోస్టారికాలో లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తుపాను బీభత్సానికి ఇక్కడ ఆరుగురు మృతి చెందారు. తుపాను ఉత్తర దిశగా ప్రయాణించి నికరాగ్వే చేరుకునే సమయంలో మరో 11 మంది చనిపోయారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక కోస్తారికాలో సుమారు 5వేల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

హిండురస్‌లో ముగ్గురు చనిపోయారు. చాలామంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కోస్టారికలో రైలు, విమాన సర్వీసులను రద్దు చేశారు. పర్యాటక కేంద్రాలు, పార్కులను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. తుపాను వల్ల నికరాగ్వేలో భారీ ఆస్తినష్టం జరిగింది. వీరే కాకుండా మరో ఇద్దరు చనిపోయినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక నికరాగ్వేలోని కరేబియన్ తీరంలో ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది.

నేట్‌ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తునారు. దక్షిణతీరం చేరడానికి ముందు కేటగిరీ 1 తుపానుగా మారుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. తుపాను మెక్సికో దిశగా వేగంగా కదులుతోందని చెప్తున్నారు.

ఇవి కూడా చూడండి

నౌటంకీ... నౌటంకీ!

సంబంధిత అంశాలు