ఈ పాత్ర ఓ చరిత్ర.. విలువ రూ. 248 కోట్లు

  • 15 అక్టోబర్ 2017
రూ-వేర్ పాత్ర Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆక్షన్ హౌస్ సదబీ

వెయ్యి సంవత్సరాల నాటి ఈ అరుదైన పాత్ర రూ.248 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంపాట హాంగ్‌కాంగ్‌లో రికార్డు సృష్టించింది.

చేతిలో ఇమిడిపోయే ఈ పాత్ర చైనాలోని ‘సాంగ్’ రాజవంశానికి చెందింది.

20 నిమిషాల పాటు ఉత్కంఠంగా వేలంపాట కొనసాగింది. అయితే ఆ గదిలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క బిడ్డర్. మిగతా వాళ్లంతా ఫోన్లోనే ఈ వేలం పాటలో పాల్గొన్నారని వేలం వేసిన ‘సదబీ’ సంస్థ తెలిపింది.

ఈ పాత్ర చుట్టుకొలత 13 సె.మీ. నీలం-ఆకుపచ్చ రంగులతో మెరుగు పెట్టారు. ఆకాలంలో దీన్ని బ్రష్‌లు కడగడానికి ఉపయోగించేవారు.

వేలంపాటలో ఈ పాత్రను దక్కించుకున్న వ్యక్తి ఆ గదిలో లేరు. ఫోన్ ద్వారా ఆయన వేలంపాటలో పాల్గొన్నారు. తన వివరాలను చెప్పడానికి కూడా ఆ వ్యక్తి ఇష్టపడలేదు.

రూ. 67 కోట్లతో వేలం పాట ప్రారంభమైంది. రూ.248 కోట్లకు ఆ అజ్ఞాత వ్యక్తి గెలుచుకున్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఈ పాత్రను బ్రష్‌లు కడగడానికి ఉపయోగించేవారు

ఈ పాత్రను ఓ అరుదైన అద్భుతమని ఆక్షన్ హౌస్‌లోని చైనీస్ ఆర్ట్ అధికారి చెప్పారు.

‘‘ఈ పాత్ర ఇంత ధర పలుకుతుందని అనుకోలేదు. అయితే, గట్టి పోటీ మాత్రం ఉంటుందని భావించాం. ‘రు-వేర్’ వస్తువులను ఎప్పుడు వేలం వేసినా ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే, చైనా చరిత్రలో రు-వేర్ వస్తువులకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకూ ఉండదు’’ అన్నారు.

అయితే, ఈ పాత్రలకు నకలుగా చాలా పాత్రలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పాత్రలు తమవద్ద ఉన్నాయంటూ నిత్యం ఎంతో మంది తనకు ఇ-మెయిల్స్ పంపిస్తుంటారని, కానీ, సాంగ్ రాజవంశానికి చెందిన పాత్రలు నాలుగు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయని వివరించారు.

మా ఇతర కథనాలు:

2014లో మింగ్ రాజవంశానికి చెందిన వైన్ పాత్రను, లియు అనే వ్యక్తికి రూ. 235 కోట్లకు అమ్మారు. ఈ రికార్డును తాజాగా రూ. 248 కోట్లతో ఈ రూ-వేర్ పాత్ర అధిగమించింది.

వైన్ పాత్రను కొనుగోలు చేసిన లియు చైనాలో ఓ సంపన్నుడు. కళాఖండాలను సేకరించడం అతడి హాబీ. ఈయన గతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు