అమెరికా యుద్ధ ప్రణాళికను తస్కరించిన ఉత్తర కొరియా హ్యాకర్లు

  • 10 అక్టోబర్ 2017
డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్ Image copyright Reuters
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది

ఉత్తర కొరియా హ్యాకర్లు దక్షిణ కొరియా నుంచి భారీ మొత్తంలో సైనిక సమాచార పత్రాలను తస్కరించారని దక్షిణ కొరియా ప్రజాప్రతినిధి రీ చియోల్-హీ పేర్కొన్నారు. ఆ పత్రాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్‌ను హత్య చేసేందుకు రూపొందించిన ప్లాన్‌ కూడా ఉందని చెప్పారు.

దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ డాటా సెంటర్ నుంచి 235 గిగాబైట్ల సైనిక పత్రాలను హ్యాకర్లు దొంగిలించారని ఆయన పేర్కొన్నారు. మిత్రదేశమైన అమెరికా సైనిక సీనియర్ కమాండర్లకు దక్షిణ కొరియా పంపించిన కీలక పత్రాలు కూడా అందులో ఉన్నాయని చెప్పారు.

దక్షిణ కొరియాలో ముఖ్యమైన విద్యుత్ ప్లాంట్లు, కీలకమైన సైనిక స్థావరాల సమాచారంతో పాటు ఆ దేశ ప్రత్యేక బలగాల ప్రణాళికలను కూడా ఉత్తర కొరియా హ్యాకర్లు దొంగిలించినట్లు చెప్తున్నారు.

ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖ నిరాకరించింది.

హ్యాకింగ్ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఇవన్నీ దక్షిణ కొరియా అల్లుతున్న కట్టుకథలని ప్రత్యారోపణ చేసింది.

నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే హ్యాకర్లు దాడి చేసినట్లు చెప్తున్నారు.

సైబర్ దాడిలో తమ దేశం నుంచి భారీ సమాచారం దొంగతనానికి గురైందని, దీని వెనుక ఉత్తర కొరియా హస్తం ఉండి ఉండొచ్చని ఈ ఏడాది మే నెలలో దక్షిణ కొరియా పేర్కొంది. అయితే పోయిన సమాచారం గురించి వివరాలేవీ వెల్లడించలేదు.

ఉత్తర కొరియా వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన హ్యాకర్లు ఉన్నారని.. వారు చైనాతో పాటు పలు విదేశాల నుంచి సైబర్ దాడులు చేస్తున్నారని దక్షిణ కొరియా భావిస్తోంది.

అమెరికా - దక్షిణకొరియాల యుద్ధ ప్రణాళికలను ఉత్తర కొరియా సంపాదించిందన్న వార్తలు.. అమెరికా - ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించబోదని పరిశీలకులు అంటున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీకి 12 స్థానాల్లో ఆధిక్యం

సుప్రీం కోర్టు: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు’ పిటిషన్‌పై 11వ తేదీన విచారణ

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి

నల్లజాతి బ్రిటన్ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తొలిసారిగా స్కాలర్‌షిప్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’

దిల్లీ: స్కూలు బ్యాగుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం... 43 మంది మృతి