ఎవరు అబద్ధాల కోరు?

  • 11 అక్టోబర్ 2017
Cups game Image copyright Getty Images

పజిల్‌ 1

రాహుల్‌ అబద్ధాల కోరన్నాడు రవి.

రంగానే అబద్ధాలు ఆడుతాడని రాహుల్ చెప్పాడు.

అదేంకాదు, రవి, రాహుల్ ఇద్దరూ అబద్ధాలే చెబుతారని రంగా అన్నాడు.

రాహుల్, రవి, రంగా ముగ్గురూ ఎల్లప్పుడూ అబద్ధమో, నిజమో చెప్తారని అనుకుంటే.. అసలు నిజం చెప్తున్నది ఎవరు?

పజిల్ కష్టంగా ఉందా? అయితే, సమాధానం కోసం కింద చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ పజిల్‌ను పరిష్కరించండి

జవాబు:

రాహుల్ నిజం చెప్తున్నాడన్నది కరెక్ట్ ఆన్సర్.

ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ రవి గురించి రంగా నిజం చెప్తున్నాడనుకుంటే, అప్పుడు రాహుల్ నిజాయతీ పరుడని రవి చెప్పినట్లు లెక్క.

అలాంటప్పుడు రంగా అబద్ధం చెప్పినట్టే.

అలాకాకుండా, రవి నిజాయతీపరుడైతే, అప్పుడు రంగా నిజంగా నిజాయతీపరుడని రాహుల్ చెప్తున్నాడు.

కానీ అది తప్పని తెలుస్తోంది.

అందువల్ల ఒక్క రాహుల్ మాత్రమే నిజం చెప్తున్నట్లు లెక్క.

ఈ పజిల్ అలెక్స్ బెల్లొస్ తయారు చేశారు.

ఇవి కూడా ప్రయత్నించండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)