సోషల్ మీడియాలో కేజ్రీకారుపై సెటైర్లు

  • 12 అక్టోబర్ 2017
కేజ్రీవాల్, కారు, దొంగతనం, ట్వీట్ Image copyright Getty Images

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారును ఎవరో కొట్టేశారన్న వార్త గురువారం రాత్రి వైరల్ అయింది. దిల్లీ సచివాలయ ప్రాంగణంలోనే ఆ కారును కొట్టేశారన్నది ఆ వార్త సారాంశం. వార్తా సంస్థ పీటీఐ కూడా దీన్ని నిర్ధరించింది.

కారు చోరీ వార్తను కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేయగానే సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు హల్ చల్ చేశాయి.

ఈ నీలిరంగు వేగన్-ఆర్ కారును కేజ్రీవాల్ 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు వాడారు. ప్రస్తుతం దీన్ని ఓ కార్యకర్త వినియోగిస్తున్నారు.

ఈ కారును సచివాలయం వద్ద గురువారం మధ్యాహ్నం ఎవరో కొట్టేశారని పోలీసులు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత ఈ కారు కేజ్రీ నిరాడంబరతకు నిదర్శనంగా ఉండేది. చివరకు ఆయన ఈ కారులోనే వెళ్లి సీఎంగా ప్రమాణం చేశారు.

ఈ కారును ఆప్ మద్దతుదారుడు లండన్‌లో ఉంటున్న కుందన్ శర్మ పార్టీకి విరాళంగా ఇచ్చారు. దీన్ని 2005లో రిజిస్టర్ చేశారు.

సోషల్ మీడియాలో సెటైర్లు

తాను వెంటనే దిల్లీ వచ్చి కారును వెతికే పనిలో పడతానని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.

పలువురు మోదీనే కారును తీసుకెళ్లాడేమోనని ట్వీటారు.

Image copyright Twitter

"ముఖ్యమంత్రి గారి కారుకే దిక్కు లేకపోతే మరి సామాన్యుల సంగతేంటి..? ఇక మన భద్రత మనమే చూసుకోవాల్సిందే" అని రాకేశ్ కె ట్వీట్ చేశారు.

"15 లక్షల సీసీ కెమేరాలు ఎక్కడ పెట్టారయ్యా? కనీసం మీ కారులో ఒకటైనా పెట్టాల్సింది" అని ధర్మిశ్ షా ఉచిత సలహా ఇచ్చారు.

"కొంతమందికి ఇది అదృష్ట దేవతలా కనిపిస్తూ ఉండొచ్చు" అని మరొకరు ట్వీటారు.

Image copyright Twitter

"ముఖ్యమంత్రి కూడా మాలాగే సామాన్యుడని తొలిసారిగా అర్థమైంది" అని ఇంతియాజ్ అలాం అన్నారు.

ఆ కారు "మోదీ దగ్గర ఉందేమో" అని ధ్రువ్.. ప్రధాని నివాసం వద్ద పార్క్ చేసి ఉందని మరొకరు ట్వీట్ చేశారు.

"ఇందుకు దిల్లీ పోలీసులను లిమ్కా బుక్‌లో ఎక్కించొచ్చు" అని సీమ వర్మ పేర్కొన్నారు.

"ఇప్పుడు ఆమ్ ఆద్మీకి బీఎండబ్ల్యూ కొనుక్కొనే అవకాశం వచ్చింది" అని మరొకరు చమత్కరించారు.

Image copyright Twitter

"రాజు గారు మీ రథాన్ని ఎవరు పట్టుకెళ్లారు" అని పవన్ దత్తా పేర్కొన్నారు.

"జయ్ షా కేసు నుంచి దృష్టి మరల్చేందుకు మోదీనే ఈ పని చేశాడేమో?" అని నిమేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

"కేంద్ర ప్రభుత్వం అధీనంలోని దిల్లీ పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేజ్రీవాల్ పన్నిన మరో పన్నాగం ఇది" అని మరకొరు ట్వీటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం