ఈ బల్లకట్టు కనీసం ఎన్నిసార్లు నది దాటాలి?

  • 18 అక్టోబర్ 2017
Raft Image copyright Getty Images

పజిల్ - 3

ఇద్దరు పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు ఒక నదిని దాటాలి. వాళ్లు ఒక బల్లకట్టు తయారు చేశారు.

కానీ అది కేవలం ఒక పెద్ద వ్యక్తి బరువును, లేదంటే ఇద్దరు పిల్లల బరువును మాత్రమే మోయగలదు.

ఆ నలుగురూ నది దాటాలంటే ఆ బల్లకట్టు నది మీద అటూ ఇటూ కనీసం ఎన్నిసార్లు తిరగాలి?

సమాధానం కోసం క్లిక్ చేయండి

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ పజిల్‌ను పరిష్కరించండి

జవాబు

బల్లకట్టు కనీసం తొమ్మిది సార్లు నది ఆ ఒడ్డుకూ ఈ ఒడ్డుకూ తిరగాలి.

మీరు రకరకాలుగా లెక్కించి ఉండొచ్చు. కానీ వివరణ ఇదీ.

ఒక వేళ ఒక పెద్ద మనిషి నది దాటి అవతల ఒడ్డుకు వెళితే.. బల్లకట్టును వెనుకకు తేవడానికి ఒక చిన్నారి అవతల వేచి ఉండాలి. మొదట ఇద్దరు పిల్లలూ బల్లకట్టు మీద నది దాటి అవతలి ఒడ్డుకు వెళ్లి, ఒకరు అక్కడ దిగి, మరొకరు బల్లకట్టును వెనక్కు తెస్తేనే ఇది సాధ్యమవుతుంది.

ఇలా చేయడానికి బల్లకట్టు అవతలికి ఒకసారి, ఇవతలికి ఒకసారి.. మొత్తం రెండుసార్లు తిరగాలి.

మూడోసారి.. ఇద్దరు పెద్దవాళ్లలో ఒకరు బల్లకట్టు మీద అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ముందు అక్కడకు వెళ్లి వేచివున్న చిన్నారి ఆ బల్లకట్టును తీసుకుని ఇవతలి ఒడ్డుకు రావాలి.

అప్పుడు బల్లకట్టు నాలుగోసారి నది దాటుతుంది.

అంటే నాలుగు సార్లు బల్లకట్టు నదిని దాటిన తర్వాత.. ఇద్దరు పెద్దవాళ్లలో ఒకరు అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.

మిగతా ముగ్గురూ ఇవతలి ఒడ్డు మీద ఉంటారు.

ఇదే క్రమంలో ఇంకో నాలుగు సార్లు తిరిగితే.. రెండో పెద్ద మనిషి కూడా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. అంటే ఇద్దరు పెద్దవాళ్లు అవతలి ఒడ్డుకు చేరుకుంటే, ఇద్దరు పిల్లలు ఇవతలి ఒడ్డు మీద ఉంటారు. చవరిగా తొమ్మిదోసారి ఇద్దరి పిల్లలూ బల్లకట్టు మీద అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.

ఇది యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఎన్‌రిచ్ ప్రాజెక్టులోని పజిల్.

ఇవి కూడా ప్రయత్నించండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు