అధ్యయనం: మెదడును రీసెట్ చేసే పుట్టగొడుగులు

  • 22 జనవరి 2018
పుట్టగొడుగులు Image copyright iStock

వైద్యానికి సాధ్యంకాని మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయని తేలింది. వీటిలో మెదడును 'రీసెట్' చేసే ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తాజా పరిశీలనలు చెబుతున్నాయి.

డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా? అనే కోణంలో కొన్నాళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.

పుట్టగొడుగుల నుంచి తీసిన 'సైలోసైబిన్‌' అనే పదార్థాన్ని మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 19 మందికి ఇచ్చారు. దీన్ని తీసుకున్న తర్వాత తమ మెదుడులో మంచి మార్పులు వచ్చాయని సగం మంది చెప్పారు.

సైలోసైబిన్‌ ఇవ్వక ముందు, ఇచ్చిన ఒక రోజు తర్వాత రోగుల మెదడును స్కాన్ చేశారు. మెదడులోని రెండు కీలక మార్పులను గుర్తించినట్టు పరిశోధకులు వెల్లించారు.

Image copyright iStock
  • మెదడులోని ‘అమిగ్దల’ అనే భాగం కోపం, వ్యాకులత వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. పుట్టగొడుగులు తినటం వల్ల ఈ భాగంలో చురుకుదనం తగ్గింది. ‘అమిగ్ద’లలో చురుకుదనం ఎంత తగ్గితే, మానసిక ప్రశాంతత అంత మెరుగవుతుంది.
  • మెదడులోని అన్ని భాగాల మధ్య సమన్వయం నిలకడగా ఉంది.

ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులు వాళ్లంతట వాళ్లే "నా మెదడు ఇప్పుడు రీసెట్ అయ్యింది. మళ్లీ పుట్టినట్లు అనిపిస్తోంది. అంతా ప్రశాంతంగా ఉంది. నా మెదడు ఇప్పుడు శుభ్రమైంది" అన్నారని పరిశోధకుడు డాక్టర్. రోబోన్ తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఈ అధ్యయనం డిప్రెషన్‌లో ఉన్నవారిపై మాత్రమే నిర్వహించారు. మరిన్ని విస్తృత పరిశోధనలు జరిగితే డిప్రెషన్‌కు చక్కని పరిష్కారం కనుగొనే వీలుంటుందని రోబిన్ అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం