న్యూడ్ ఫొటోలు పంపుకోవడం వెనుక యువతుల ఆంతర్యం?

  • 17 అక్టోబర్ 2017
సెల్ఫీ Image copyright Getty Images

హఠాత్తుగా గీత ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె దాన్ని స్వైప్ చేయగానే వాట్సాప్‌లో ఒక ఫొటో ప్రత్యక్షమైంది.

అది ఆమె స్నేహితురాలు పంపిన మిర్రర్ సెల్ఫీ. ఒట్టి సెల్ఫీ కాదు, న్యూడ్ సెల్ఫీ.

దాన్ని చూసి నవ్వుకున్న గీత, ఓ ఎమోజీతో దానికి రిప్లై ఇచ్చింది.

ఈ ఘటన ఆధారంగా గీతకు, ఆమె స్నేహితురాలికి మధ్య ఏదో లైంగిక సంబంధం ఉందని భావిస్తే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. వాళ్లిద్దరూ కేవలం మంచి స్నేహితులు.. అంతే.

వారంలో చాలాసార్లు వాళ్లిద్దరూ ఒకరికొకరు ఇలాంటి న్యూడ్ సెల్ఫీలు పంపుకుంటారు.

''ఓసారి ఒంటరిగా ఉన్నపుడు నేనీ తుంటరి పని చేశా'' అని 26 ఏళ్ల గీత చెప్పింది.

''బట్టలు లేకుండా నా శరీరం ఎంత అందంగా ఉందో నా స్నేహితురాలికి తెలియజెప్పడానికే నేనా పని చేశా. ఆ తర్వాత అదే సరదాగా మారింది. అప్పుడప్పుడూ నా స్థనాలు కనిపించేలా సెల్ఫీ పంపుతుంటా. ఇవన్నీ సరదా కోసమే.'' అని వివరించింది.

Image copyright DAISY WALKER

ఇలాగ ఇంకెందరో

ఇలా నగ్నంగా ఉండే సెల్ఫీలను పంపుకునేది గీత, ఆమె స్నేహితురాలు మాత్రమే కాదు.

27 ఏళ్ల ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డైసీ వాకర్, ''న్యూడ్ సెల్ఫీలు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి'' అని అంటున్నారు.

''ఈ న్యూడ్ సెల్ఫీల వల్ల నన్ను నేనుగా స్వీకరిస్తా. నేను అందంగా ఉన్నానా, లేదా అన్నది నాకు అనవసరం. నన్ను నేను నగ్నంగా చూసుకోవడం నాకు గర్వ కారణం, అంతే'' అని డైసీ తెలిపారు.

కొంతమంది స్నేహితురాళ్లతో కలిసి ఆమె ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసారు. దానిలో ఉన్నవాళ్లంతా తమ న్యూడ్ సెల్ఫీలను షేర్ చేసుకుంటారు.

ఆ గ్రూప్‌లో ఉన్న పాపీ, ''ఇది భౌతిక సౌందర్యాన్ని పంచుకోవడం లాంటిది. దీన్ని మీరు ఒక కళ అనుకోవచ్చు లేదా సరదా అనుకోవచ్చు.''

అయితే దీనిలో కొంచెం ప్రమాదం ఉందన్న విషయాన్ని కొట్టిపారేయలేం. ఫొటోలను షేర్ చేసుకునేప్పుడు అది పొరబాటున వేరే వ్యక్తికి వెళితే?

''నా స్నేహితురాళ్ల మీద నాకు పూర్తిగా నమ్మకముంది. అదీగాక, నా న్యూడ్ ఫొటోలు లీకైనా, ఐ డోంట్ కేర్. నేను కేవలం నా శరీరాన్ని శక్తివంతమైన రూపంలో చూపిస్తున్నానంతే'' అంటారు గీత.

''అయితే నా స్నేహితుల్లో కొంతమంది భయపడే వాళ్లున్నారు. వాళ్లు న్యూడ్ సెల్ఫీల్లో తమ తలను క్రాప్ చేసి పంపుతుంటారు'' అని తెలిపారు.

Image copyright INSTAGRAM
చిత్రం శీర్షిక ఇన్‌స్టాగ్రామ్‌లో 'బాడీ పాజిటివిటీ' ఉద్యమం

న్యూడ్ సెల్ఫీలు - ఒక నిరసన

న్యూడ్ సెల్ఫీలు పంపుకోవడం ద్వారా మహిళలు ''సర్వాంగ సుందరమైన శరీరం'' అన్న భావనపై నిరసన వ్యక్తం చేస్తున్నారని ఎమ్మా రోజ్ అంటారు.

నార్తాంప్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఎమ్మా సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొనసాగుతున్న 'బాడీ పాజిటివిటీ' ఉద్యమం కూడా ఇలాంటిదే. దానిలో ప్రతి 'బాడీ షేప్‌'ను గౌరవించాలనే సందేశం ఉంటుంది.

కేవలం మహిళల్లోనే కాదు, ఈ ట్రెండ్ పురుషుల్లోనూ విస్తరిస్తోంది.

పురుషులూ తమ మర్మాంగాలను ప్రదర్శించే సెల్ఫీలను స్నేహితులతో పంచుకుంటున్నారు.

నగ్నదేహాన్ని కేవలం లైంగిక కోణం నుంచి చూడడం తప్పనేది గీత భావన.

ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?

100 మంది మహిళలు: నారీలోకానికి నాడీమంత్రం

బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)