జార్ఖండ్‌: ఆధార్ లేకుంటే రేషన్ నిలిపివేత నిజమే

  • 18 అక్టోబర్ 2017
సంతోషి Image copyright Dhiraj

సెప్టెంబర్ 28న జార్ఖండ్ రాష్ట్రంలోని సిండేగా జిల్లా కారామాటి గ్రామానికి చెందిన పదకొండేళ్ల సంతోషి నాలుగు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది.

ఆధార్ కార్డుతో లింకు చేయని కారణంగా దాదాపు 8 నెలలుగా ఆమె కుటుంబానికి రేషన్ లభించడం లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే ఆమెది ఆకలి చావు కాదని, ఆమె మరణానికి కారణం మలేరియా అని జార్ఖండ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

కానీ, బీబీసీ విచారణలో ఆధార్ కార్డుతో లింక్ చేయని రేషన్ కార్డులను రద్దు చేసిన మాట నిజమే అని తేలింది.

Image copyright I & PR, Jharkhand Govt

రేషన్ కార్డుల రద్దు నిజమే

జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్ బాల వర్మ ఈ ఏడాది మార్చి 27వ తేదీన ప్రజా పంపిణీ శాఖ పనితీరుపై సమీక్ష జరిపారు.

ఆ సందర్భంగా.. ఆధార్ కార్డుతో లింక్ చేయని రేషన్ కార్డులు ఏప్రిల్ 5వ తేదీ నుంచి చెల్లవని నిర్ణయించారు.

ఈ మేరకు మార్చి 27వ తేదీన జార్ఖండ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆధార్‌తో లింక్ చేయని సుమారు 3 లక్షల రేషన్ కార్డుల్ని రద్దు చేసినట్లు కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)