అఫ్ఘాన్ సైనిక స్థావరంపై తాలిబన్ల ఆత్మాహుతి దాడి: 43 మంది సైనికుల మృతి

ఒక తనిఖీ కేంద్రం వద్ద విధి నిర్వహణలో ఉన్న సైనికుడు

అప్ఘానిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో ఒక సైనిక స్థావరంపై ఇద్దరు తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 43 మంది అఫ్ఘాన్ సైనికులు చనిపోయారు.

ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. మరో ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు. దాడితో సైనిక స్థావరం ధ్వంసమైంది.

గురువారం మైవాండ్ జిల్లా చాష్మో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో పదిమంది మిలిటెంట్లు కూడా చనిపోయినట్లు చెబుతున్నారు.

దాడి అనంతరం స్థావరానికి మిలిటెంట్లు నిప్పు పెట్టారని రక్షణశాఖ అధికార ప్రతినిధి దాలత్ వజీరీ తెలిపారు.

ఘజ్నీ ప్రావిన్స్‌లో పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన మరొక దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)