కాబూల్‌ మసీదులో ఆత్మాహుతి దాడి. కనీసం 60 మృతి

  • 20 అక్టోబర్ 2017
తుపాకీతో సైనికుడు Image copyright Getty Images

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షియా మసీదులపై శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 60 మంది ప్రజలు మృతి చెందారని అధికారులు తెలిపారు

ఇమామ్ జమాన్ మసీదులోకి ఒక సాయుధుడు ప్రవేశించి కాల్పులు జరిపి, బాంబు పేల్చటంతో 39 మందికి పైగా చనిపోయారు.

ఘోర్ ప్రావిన్సులోని మసీదుపై జరిగిన మరొక దాడిలో కనీసం 20 మంది మరణించారు.

కాబూల్‌ నగరానికి పశ్చిమాన ఉన్న ఇమామ్ జమాన్ మసీదు వద్ద జరిగిన ఈ దాడి చాలా తీవ్రమైనదని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీకి వివరించారు.

శుక్రవారం ప్రార్థనలకు అంతా సిద్ధమవుతుండగా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవటంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడులకు పాల్పడింది ఎవరో ఇంత వరకు తెలియరాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లోని షియా మసీదులను ఇస్లామిక్‌ స్టేట్‌ లక్ష్యంగా చేసుకుంది.

కాగా, ఒక భారీ దాడికి పాల్పడాలని భావిస్తున్న ఆత్మాహుతి ట్రక్ బాంబర్‌ను అరెస్టు చేశామని కాబూల్ పోలీసులు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.

ఆగస్టు నెలలో కూడా కాబూల్‌లో మసీదుపై జరిగిన బాంబుదాడిలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మే నెలలో జరిగిన ట్రక్ బాంబు దాడిలో 150 మందికి పైగా ప్రజలు మ‌ృతి చెందారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు