అమెరికాలో బాల్య వివాహాలను అడ్డుకునే చట్టాలే లేవు

ఆర్థిక రంగంలో, అక్షరాస్యతలో ఎంత అభివృద్ధి చెందినా అమెరికాలో నేటికీ బాల్యవివాహాలు పెద్దఎత్తునే జరుగుతున్నాయి.

ఊహ తెలియని ప్రాయంలోనే ఎంతో మంది బాలికలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బాల్యవివాహాల నిషేధ చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అలాంటి చట్టాల వూసే లేదు.

చాలా రాష్ట్రాల్లో వధూవరులకు కనీస వయసు నిబంధన లేదు. సగం రాష్ట్రాల్లో ఆ నిబంధన ఉన్నా, కనీస వయసు 13 లేదా 14 ఏళ్లుగానే ఉంది. దీంతో ఏటా వేలాది బాల్య వివాహాలు జరుగిపోతున్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)