ఇండోనేషియాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, 46 మంది మృతి

  • 26 అక్టోబర్ 2017
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తయారీ కేంద్రం వద్ద చుట్టుపక్కల ప్రజలు Image copyright AFP

ఇండోనేషియాలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో దాదాపు 46 మంది చనిపోయారు. మరో 46 మంది గాయపడ్డారు. మరో 10 మంది ఆచూకీ తెలియడం లేదు.

దేశ రాజధాని జకార్తాకు సమీపంలోని ట్యాంగ్‌ర్యాంగ్ పారిశ్రామిక వాడలో గురువారం ఈ ప్రమాదం జరిగింది.

"ఇక్కడ 46 మృతదేహాలు ఉన్నాయి. ఇంకా బాధితులను రక్షించే పనులు జరుగుతున్నాయి" అని ట్యాంగ్‌ర్యాంగ్ కోటా పోలీసు అధికారి హ్యారీ కుర్నియావన్ ఏఎఫ్‌పీకి తెలిపారు.

ప్రస్తుతం మంటలు నియంత్రణలోకి వచ్చాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

అయితే అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఫ్యాక్టరీ పని చేయడం ప్రారంభించి ఆరు వారాలు మాత్రమే అయినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు మెట్రో టీవీ‌కి వెల్లడించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

#FIFA2018: 20 ఏళ్ల తర్వాత కప్పుగొట్టిన ఫ్రాన్స్

మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా

ప్రెస్ రివ్యూ: కత్తి మహేశ్‌, పరిపూర్ణానందలను ఎందుకు బహిష్కరించామంటే.. గవర్నర్‌కు కేసీఆర్ వివరణ

ఇతను సంగీతంతో ఆటిజాన్ని జయించాడు, వారానికి ఓ భాష నేర్చుకుంటున్నాడు

హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..

#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

ట్విటర్‌ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి

‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన