సౌదీ: మహిళల కంటే ఈ రోబోకే హక్కులు ఎక్కువా?

రోబో సోఫియా

ఫొటో సోర్స్, Arab News/You Tube

ప్రపంచంలోనే తొలిసారిగా రోబోకు సౌదీ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. రియాద్‌లో తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సులో 'సోఫియా' అనే రోబో, ఇంగ్లిష్‌లో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దాంతో ఆ రోబోకు తమ దేశ పౌరసత్వం కల్పిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు స్పందించిన సోఫియా, "నాకు ఈ ప్రత్యే గుర్తింపు ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా" అంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

ఈ రోబోను హాంకాంగ్‌ సంస్థ హాన్సన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది.

రోబోకి పౌరసత్వం ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. దానిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సౌదీలో మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకు సంప్రదాయ హిజాబ్, బురఖా ధరిస్తారు. కానీ, ఈ రోబో అవి ధరించలేదు.

దాంతో, "సౌదీలో మహిళల కంటే ఈ రోబోకే హక్కులు ఎక్కువగా ఉన్నాయా?" అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అలాగే, 'సౌదీ గార్డియన్‌షిప్ సిస్టం' ప్రకారం ఆడవాళ్లు పబ్లిక్‌లో తిరిగేటప్పుడు తన కుటుంబంలోని పురుషులు తోడుగా ఉండాలి. కానీ, సోఫీ సమావేశంలో పోడియం వద్దకు వెళ్లి ప్రసంగిస్తున్నప్పుడు దగ్గర పురుషులు లేరు.

అందుకే, "సోఫీ, ఇప్పుడు నీవు సౌదీ పౌరురాలివి. పురుషుడు తోడు లేకుండా, హిజాబ్, స్కార్ఫ్ ధరించకుండా బయటకు ఎలా వస్తావ్? ’’ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)