శిథిలాల్లో నేపాల్ వారసత్వ సంపద!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

నేపాల్‌లో భూకంపంతో ధ్వంసమైన ఆలయాల పనుల ఆలస్యంపై ఆగ్రహం

  • 28 అక్టోబర్ 2017

భూకంపంలో ధ్వంసమైన పురాతన కట్టడాల పునర్నిర్మాణం నేపాల్‌లో నత్తనడకన సాగుతోంది.

రెండున్నరేళ్లు అవుతున్నా పనులు వేగం పుంజుకోలేదు. ఆలస్యంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

అవకాశం ఇస్తే తామే చందాలు వేసుకుని ఆలయాలను నిర్మిస్తామని అంటున్నారు.

ఈ వివాదంపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. పనుల్లో జాప్యం జరుగుతున్న మాట నిజమేనని అంగీకరించింది.

అయితే, గతంలో కంటే ఇప్పుడు నిధులు ఎక్కువ విడుదల చేస్తున్నామని చెబుతోంది.

అయితే, టెండర్ ప్రక్రియలోనే సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, ఏడాదిలోగా పరిస్థితి మెరుగుకాకుంటే పురాతన కట్టడాలను 'డేంజర్ జాబితా'లో పెడతామని యునెస్కో హెచ్చరించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు