సోమాలియాలో మరోసారి పేలుళ్లు, 20మంది మృతి

  • 29 అక్టోబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసోమాలియా రాజధాని మొగదిషులో బాంబు పేలుళ్లు

సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన జంట పేలుళ్లలో 20మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు.

బాంబు ఉన్న ఓ కారు హోటల్లోకి దూసుకుపోవడంతో మొదటి పేలుడు సంభవించింది.

బస్సులో ఉంచిన ఓ బాంబు పార్లమెంటు భవన సమీపంలో పేలడంతో రెండో ఘటన చోటుచేసుకుంది.

తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది.

రెండు వారాల క్రితం జరిగిన పేలుళ్లకు కూడా ఈ సంస్థే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కానీ ఆ పేలుళ్లు తమ పని కాదని, రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలే తమ లక్ష్యాలని అల్ షబాబ్ వెల్లడించింది.

అల్ షబాబ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. దీనికి ముందే ఈ దాడి జరిగింది.

"మరణించినవారిలో చాలామంది సాధారణ పౌరులే. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం" అని భద్రతా అధికారి మొహమ్మద్ మోలిమ్ అదాన్ తెలిపారు.

గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు.

సోమాలియాలో అక్టోబరు 14న జరిగిన బాంబు దాడిలో 358 మంది చనిపోయారు. 56మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు