రష్యన్ విప్లవానికి వందేళ్లు: చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన పది పోస్టర్లు

రష్యా విప్లవానికి (1917) సృజనాత్మకత, కళ ఎంతో సహాయపడ్డాయి. బీబీసీ రష్యన్ ప్రతినిధి అలెక్సాంద్రా సెమ్యొనోవా నాటి విప్లవ ప్రచారానికి సంబంధించిన పది ముఖ్యమైన పోస్టర్లను రష్యన్ కాంటెంపరరీ హిస్టరీ మ్యూజియం నుంచి సేకరించారు.

“లోన్ ఆఫ్ ఫ్రీడం”

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

రష్యన్ విప్లవానికి వందేళ్లు: ప్రముఖ రష్యన్ కళాకారుడు బోరిస్ కుస్తోడివ్ “లోన్ ఆఫ్ ఫ్రీడం” నినాదంతో ఈ పెయింటింగ్ వేశారు. ఇందులో అతను రష్యా ప్రజలను మొదటి ప్రపంచ యుద్ధానికి ఆర్థిక సహాయం కోరుతున్నారు. రుణ ప్రకటనగా ఈ పోస్టర్‌ను ఫిబ్రవరి 1917లో విడుదల చేశారు. అక్టోబర్ వరకూ ఈ సైనికుడిని ప్రతి పోస్టర్‌లో చూపించారు.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

మాస్కోలో వోస్కరే సెన్స్కాయ స్క్వేర్, పార్లమెంట్ బిల్డింగ్ విప్లవ ర్యాలీలకు పెద్ద వేదికలు. ఈ పోస్టర్ కూడా అప్పటిదే. విప్లవంలో ప్రజల ఉత్సాహాన్ని ఈ పోస్టర్ తెలుపుతోంది. ఈ విప్లవం కొత్త శకానికి నాంది పలికింది. అప్పుడు కొనసాగిన యుద్ధం నేపథ్యంలో ఇదంతా జరిగింది.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

నాయకులు - ఇది నిజంగా పోస్టర్ కాదు. ఇదో కరపత్రం. ఇందులో రష్యా అధికారం కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెబుతున్నారు. రష్యా రాజకీయ ప్రముఖులు ఇందులో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులైన మిఖైల్ రాడ్జియానో ఇందులో ఉన్నారు. రష్యన్ పార్లమెంటు (దూమా) మధ్యలో ఉంది. రష్యా మొదటి సోషలిస్ట్ ప్రభుత్వ అధినేత అలెగ్జాండర్ కేరెన్ స్కీ దిగువ భాగంలో ఎడమ వైపు ఉన్నారు. పై భాగంలో సాయుధుల నినాదాలు “భూమి, స్వతంత్రం!”, "పోరాటం ద్వారానే మీరు మీ హక్కులు పొందుతారు!" ఈ పోస్టర్‌లో బోల్షెవిక్కులెవరూ లేరు.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

మారుతున్న రాజకీయ పరిణామాలు- దీనిని వామపక్ష ప్రచురణ సంస్థ పారుస్ విడుదల చేసింది. ఈ ప్రచురణ సంస్థను విప్లవానికి ముందు రచయిత మాక్సిమ్ గోర్కీ స్థాపించాడు. వ్లాదిమిర్ మయకోవ్ స్కై, అలెక్సీ రాడకోవ్ లాంటి ప్రముఖ కవులు, కళాకారులు ఈ పోస్టర్లను రూపొందించారు. ఫోటో పై భాగంలో సైనికుడు పెట్టుబడిదారులను రక్షిస్తున్నాడు. "ఇందుకే సైనికులున్నారు" అనే నినాదం ఉంది. కింది భాగంలో విప్లవం తర్వాత పరిస్థితులను ఉద్దేశిస్తూ “భూమి, స్వతంత్రం!”, “ప్రజాస్వామ్యం, గణతంత్ర రాజ్యం!” “స్వేచ్ఛ!”. వీటి క్యాప్షన్ "ఇతడే నేడు రక్షిస్తున్నాడు" అనే నినాదాలున్నాయి.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

ఉదయిస్తున్న సూర్యుడు - మార్చి 1917లో, టీసర్ నికోలస్ II, తన అధికారాన్ని విడిచిపెట్టినప్పటిది ఈ పోస్టర్. "ప్రజా విజయానికి జ్ఞాపిక" అనే నినాదంతో ఉంది. ఈ పోస్టర్‌లో టీసర్ నికోలస్ తన అధికారాన్ని సాయుధ సైనికుల రూపంలో ఉన్న విప్లవకారులకు అప్పగిస్తున్నారు. ఇందులో రష్యా చారిత్రక భవనం టౌరిడ్ ప్యాలెస్ కూడా ఉంది. దుమా ప్రతినిధులు ఇక్కడే సమావేశమవుతారు. పై భాగంలో ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. అది స్వేచ్ఛకు ప్రతీక. ఆ కాలంలో రూపొందిన పోస్టర్లలో ఈ చిహ్నాన్ని ఎక్కువగా చూపించారు.

ఫొటో సోర్స్, Sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

సోషల్ పిరమిడ్ - వామపక్ష ప్రచురణ సంస్థ పారుస్, మయకోవ్ స్కై, రాడకోవ్ లాంటి ప్రముఖ కవులు, కళాకారుల సహకారంతో దీనిని రూపొందించారు. ఈ పోస్టర్ పై భాగంలో టీసర్ నికోలస్ పిల్లి చర్మంతో తయారు చేసిన వస్త్రధారణతో ఉన్నాడు. ఇందులో ప్రజలను మోసం చేస్తున్నట్లుగా టీసర్ నికోలస్‌ను చూపించారు. పై నుంచి కిందికి వరుసగా "మేము పరిపాలిస్తున్నాం. మేము మీ కోసం ప్రార్థిస్తున్నాం. మీపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. మిమ్మల్ని రక్షిస్తున్నాం. మీకు ఆహారం అందిస్తున్నాం. మీరు మాత్రం పని చేస్తారు" అని ఉంది. 1917లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇలాంటి వ్యంగ్య కథనాలన్నిటినీ రాచరిక వ్యవస్ధ కొనసాగిస్తున్న టీసర్ నికోలస్, అతని భార్యను విమర్శిస్తూ రూపొందించారు.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

ప్రచార నమూనా - 1917లో రాచరిక వ్యవస్ధ చివరిదశలో రష్యాలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరిగింది. అప్పుడు రాజకీయంగా పరిస్ధితులు ఎంతో తీవ్రంగా ఉండేవి. ఎన్నికల్లో డజన్ల కొద్దీ సంస్థలు పాల్గొన్నాయి. వాటన్నిటిలో సోషల్ రివల్యూషనరీ పార్టీ అత్యంత పెద్దది. ఈ పోస్టర్ లో "కామ్రేడ్ పౌరుల్లారా! రాజ్యాంగ అసెంబ్లీ ప్రారంభ రోజున ప్రదర్శనలకు సిద్ధం కండి! " అనే నినాదం ఉంది.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

“అరాచకత్వం ప్రజాస్వామ్యంతో తుడిచిపెట్టుకుపోతుంది.!” అనే ఈ పోస్టర్ క్యాడెట్ పార్టీది. క్యాడెట్ పార్టీ జంతువుల, పౌరాణిక చిత్రాలతో పోస్టర్లను రూపొందించేది. ఇక్కడున్న రాక్షస బల్లి అరాచకత్వానికి గుర్తుగా, తెల్లటి గుర్రం మీదున్న వీరుడు ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఈ పోస్టరును రూపొందించారు.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

సంకెళ్లను బద్దలు కొట్టడం - సోషలిస్టు రివల్యూషనరీ పార్టీ ఎన్నికల పోస్టర్ ను సాదాగా రూపొందించారు. కార్మికుల, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో “సోషలిస్టు రివల్యూషనరీ పార్టీ - యుద్ధంతో మాత్రమే మీరు మీ హక్కులను పొందుతారు!” అనే నినాదముంది. “భూమి, స్వతంత్రం!”, ఇంకా “బానిసత్వ సంకెళ్లను వదిలించుకోండి, మొత్తం ప్రపంచానికి స్వేచ్ఛ లభిస్తుంది” అనీ ఇందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, sovrhistory.ru

ఫొటో క్యాప్షన్,

ఇక పార్టీ సంగతి - బోల్షెవిక్ పార్టీ (ఆర్ఎస్‌డిఎల్‌పి) పోస్టర్ల విషయంలో వెనకబడి ఉంది. 1917 ఎన్నికల ప్రచారంలో వారి పోస్టర్ చాలా సాధారణంగా ఉంది : "ఆర్ఎస్‌డిఎల్‌పి లిస్టుకే ఓటు వెయ్యండి" అనే నినాదంతో ఉంది. నవంబర్ 1917లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వారు పట్టుబడ్డారు. అప్పట్లో మయకోవ్ స్కై, రాడకోవ్ లాంటి ప్రముఖులు రోస్టా అనే బ్రాండ్‌ను రూపొందించారు. వారు రూపొందించిన పోస్టర్లపై ఉన్న సందేశం సూటిగా స్పష్టంగా ఉండేది. ఈ బ్రాండ్ సోవియట్ ప్రచారానికి గుర్తింపు చిహ్నంగా నిలిచి, క్రమంగా అది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.