ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌‌పై ఖతార్ సంక్షోభ ప్రభావం?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌‌పై ఖతార్ సంక్షోభ ప్రభావం ఎంత?

  • 30 అక్టోబర్ 2017

2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ పోటీలకు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. ఎనిమిది స్టేడియాలు, ఆరు వేల గదులు, మరెన్నో భవనాలు నిర్మిస్తోంది. అయితే, ఖతార్ సంక్షోభ ప్రభావం వరల్డ్ కప్‌పై పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాలుగు నెలల క్రితం ఇరుగుపొరుగు దేశాలతో ఖతార్ సంబంధాలు రద్దయ్యాయి.

వాణిజ్య సంబంధాల రద్దుతో నిర్మాణాలకు కావాల్సిన ముడిసరుకుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మా ఇతర కథనాలు:

అయితే, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఖతార్ చెబుతోంది.

గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు బీసీసీ టీమ్‌ 'అల్ బైట్' స్టేడియాన్ని సందర్శించింది.

ఖతార్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ నిర్వహించొద్దని గతంలో కొన్ని పాశ్చాత్య దేశాలు డిమాండ్ చేశాయి.

కార్మికుల హక్కులను ఖతార్ కాలరాస్తోందని అవి ఆరోపించాయి. అదంతా అసత్య ప్రచారమని ఖతార్ కొట్టిపారేస్తోంది.

ఈ వ్యవహారంపై బీబీసీ ప్రతినిధి ఉమెర్ డ్రాజ్ అందిస్తున్న రిపోర్ట్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)